TSK

TSK · నిర్గమ 28:30

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలిచినప్పుడు అతడు యెహోవా సన్నిధిలో ఊరీము నిర్ణయం ద్వారా అతని కోసం అడగాలి. అతడు, అతనితోపాటు ఇశ్రాయేలీయులందరూ, అంటే, సమాజమంతా ప్రతి పని అతని మాట ప్రకారం చెయ్యాలి” అన్నాడు.

¶ యెహోషువ చనిపోయిన తరువాత ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధం చెయ్యడానికి తమలో ఎవరు ముందుగా వాళ్ళ మీదికి వెళ్ళాలో యెహోవా తమకు తెలపాలని ప్రార్థన చేశారు.

రెండో రోజున ఇశ్రాయేలీయులు ధైర్యం తెచ్చుకున్నారు. మొదటి రోజు తాము నిలబడిన స్థానాల్లోనే తిరిగి నిలబడ్డారు.

సౌలు తనకు కీడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడని దావీదు గ్రహించి యాజకుడైన అబ్యాతారును ఏఫోదు తీసుకురమ్మన్నాడు.

¶ అప్పుడు దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడైన అహీమెలెకు కుమారుడు అబ్యాతారుతో చెప్పాడు. అబ్యాతారు ఏఫోదును దావీదు దగ్గరికి తీసుకు వచ్చాడు.

¶ ఊరీం, తుమ్మీం, ధరించగల ఒక యాజకుణ్ణి నియమించేదాకా దేవునికి ప్రతిష్టితమైన పదార్ధాలను తినకూడదని ప్రజల అధికారి వాళ్ళకు ఆదేశించాడు.

¶ కొరింతీయులారా, పూర్తి సత్యం మేము మీకు చెప్పాం, మా హృదయం విశాలంగా తెరిచి ఉంది.

కాబట్టి మీ ఆత్మల కోసం ఎంతో ఆనందంగా ఖర్చు చేస్తాను. మీకోసం ఖర్చయిపోతాను. నేను మిమ్మల్ని అంత ఎక్కువగా ప్రేమిస్తుంటే మీరు నన్ను ఇంత తక్కువగా ప్రేమిస్తారా?

దైవ సంబంధమైన విషయాలపై నమ్మకమైన, కరుణ కలిగిన ప్రధాన యాజకుడిగా ఉండడానికీ, ప్రజల పాపాలకు క్షమాపణ సాధించడానికీ ఆయన తన సోదరుల్లో ఒకడిగా కావాల్సిన అవసరం వచ్చింది.

మేకల, కోడె దూడల రక్తంతో కాకుండా క్రీస్తు తన సొంత రక్తంతో అతి పరిశుద్ధ స్థలంలో ఒక్కసారే ప్రవేశించాడు. తద్వారా శాశ్వతమైన రక్షణ కలిగించాడు.