TSK

TSK · నిర్గమ 28:38

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

వారు ప్రత్యక్ష గుడారంలోకి ప్రవేశించేటప్పుడు గానీ పరిశుద్ధస్థలం లో సేవ చేయడానికి బలిపీఠం దగ్గరికి వచ్చేటప్పుడు గానీ వారు దోషులై చావకుండేలా అహరోను, అతని కుమారులు వాటిని ధరించాలి. ఇది అతనికి, అతని తరువాత అతని సంతానానికి ఎప్పటికీ నిలిచి ఉండే శాసనం.”

“మీరు పాపం కోసం బలి అయిన పశువు మాంసాన్ని పవిత్ర స్థలం లో ఎందుకు తినలేదు? అది అతి పరిశుద్ధం కదా. సమాజం పాపాలను తీసివేయడానికీ, ఆయన ఎదుట పరిహారం చేయడానికీ యెహోవా దాన్ని మీకు ఇచ్చాడు కదా.

నేను అర్పణలను పరిశుద్ధ పరచే యెహోవానని చెప్పు.”

యెహోవా మిమ్మల్ని అంగీకరించేలా అతడు యెహోవా సన్నిధిలో ఆ పనను కదిలించాలి. విశ్రాంతి రోజుకు మరుసటి రోజున యాజకుడు దాన్ని కదిలించాలి.

మనందరం గొర్రెలలాగా దారి తప్పాము. మనలో ప్రతివాడూ తనకిష్టమైన దారికి తొలగిపోయాము. యెహోవా మనందరి దోషాన్ని ఆయనమీద మోపాడు.

నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపచేస్తాను. నా బలిపీఠం మీద వారు అర్పించే దహనబలులూ బలులూ నాకు అంగీకారమవుతాయి. నా మందిరం అన్ని రాజ్యాలకూ ప్రార్థన మందిరం అవుతుంది.

¶ ఆ తరువాత నీ ఎడమ వైపుకి తిరిగి పడుకో. ఇశ్రాయేలు జాతి పాపాన్నంతా నీ పైకి వేసుకో. ఇశ్రాయేలు జాతికి వ్యతిరేకంగా నువ్వు ఎన్ని రోజులు అలా పండుకుంటావో అన్ని రోజులు వారి పాపాన్ని మోస్తావు.

ఎందుకంటే మనం ఆయనలో దేవుని నీతి అయ్యేలా పాపమెరుగని ఆయనను దేవుడు మన కోసం పాపంగా చేశాడు.

అలాగే క్రీస్తు అనేకమంది పాపాలను తీసివేయడం కోసం ఒక్కసారే తనను తాను అర్పించుకున్నాడు. ఆయన రెండోసారి కనిపించనున్నాడు. అయితే ఈ సారి పాపాల కోసం కాదు కానీ తన కోసం సహనంతో వేచి ఉన్నవారి రక్షణ కోసం కనిపించనున్నాడు.

¶ మనకు పాపాల్లో ఇక ఎలాంటి భాగమూ ఉండకుండాా నీతి కోసం బతకడానికి స్వయంగా ఆయనే తన దేహంలో మన పాపాలను మాను మీద భరించాడు. ఆయన పొందిన గాయాల వలన మీరు బాగుపడ్డారు.