TSK

TSK · యెషయా 11:1

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

ఆమె ఇరుగు పొరుగు స్త్రీలు నయోమికి కొడుకు పుట్టాడని చెప్పి అతనికి ఓబేదు అని పేరు పెట్టారు. ఇతడు దావీదు తండ్రి అయిన యెష్షయికి తండ్రి.

బోయజుకు ఓబేదు పుట్టాడు. ఓబేదుకు యెష్షయి పుట్టాడు.

ఆ రోజున యెహోవా కొమ్మ అందంగానూ, మహిమతోనూ నిండి ఉంటుంది. ఇశ్రాయేలులో శేషించినవాళ్ళ భూమి పంట రుచిగానూ, చూడ ముచ్చటగానూ ఉంటుంది.

ఆ రోజున ప్రజలకు ధ్వజంగా యెష్షయి వేరు నిలుస్తుంది. జాతులు ఆయన కోసం వెదకుతాయి. ఆయన విశ్రమించే స్థలం ప్రభావం కలది అవుతుంది.

యెహోవా ఇలా చెబుతున్నాడు “రాబోయే రోజుల్లో నేను దావీదుకు నీతి అనే చిగురు పుట్టిస్తాను. ఆయన రాజుగా పాలిస్తాడు. ఆయన సౌభాగ్యం తెస్తాడు. భూమి మీద నీతి న్యాయాలను జరిగిస్తాడు.

¶ ప్రభువైన యెహోవా ఈ మాట చెప్తున్నాడు. “కాబట్టి నేనే దేవదారు చెట్టులో ఎత్తయిన కొమ్మను తీసుకుని దాన్ని నాటుతాను. నేనే దాన్ని తుంచుతాను. నేనే దాన్ని ఎత్తయిన పర్వతం పైన నాటుతాను.

అతనితో ఇలా చెప్పు. “సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే, చిగురు అనే ఒకడు ఉన్నాడు. అతడు తన స్థలంలో నుండి చిగురిస్తాడు. అతడు యెహోవా ఆలయం కడతాడు.

¶ యెషయా ఇలా అన్నాడు, “యెష్షయిలో నుండి వేరు చిగురు యూదేతరులను ఏలడానికి వస్తాడు. ఆయనలో యూదేతరులు తమ నమ్మకం పెట్టుకుంటారు.”

¶ ‹యేసు అనే నేను సంఘాలకు చెప్పడం కోసం ఈ విషయాలను మీకు తెలియజేయడానికి నా దూతను పంపించాను. నేనే దావీదు వేరునూ సంతానాన్నీ ప్రకాశవంతమైన వేకువ నక్షత్రాన్నీ.›