TSK

TSK · యిర్మీయా 13:24

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

జనాల్లోకి మిమ్మల్ని చెదరగొట్టి కత్తి దూసి మీ వెంటబడి తరుముతాను. మీ దేశం పాడైపోతుంది, మీ ఊళ్లు పాడుబడిపోతాయి.

యెహోవా భూమి ఈ చివర నుంచి ఆ చివరి వరకూ అన్య దేశాల్లో మీరు చెదిరిపోయేలా చేస్తాడు. అక్కడ మీ పితరులు సేవించని చెక్కతో, రాయితో చేసిన అన్య దేవుళ్ళను కొలుస్తారు.

దుర్మార్గులు అలా ఉండరు. వాళ్ళు గాలికి ఎగిరిపోయే ఊకలాగా ఉంటారు.

అనేక నీటి ప్రవాహాల హోరులాగా జాతులు గర్జిస్తున్నాయి. కానీ దేవుడు వాళ్ళని గద్దిస్తాడు. వాళ్ళు దూరంగా పారిపోతారు. గాలికి ఎగిరిపోయే చచ్చిన మొక్కలను గాలి ఎగర గొట్టినట్టుగా, సుడిగాలిలో పిచ్చి మొక్కలు గిర్రున తిరిగి పోయినట్టుగా వాళ్ళు పారిపోతారు.

¶ ఆ రోజుల్లో ఆ ప్రజలకు యెరూషలేము నివాసుల గూర్చి ఇలా చెబుతారు. “ఎడారిలో చెట్లులేని మెరకల నుండి నా ప్రజల పైకి వడగాలి వీస్తున్నది. అది తూర్పార పట్టడానికో, శుద్ధి చేయడానికో కాదు.

పట్టణాన్ని ముట్టడించిన రోజులు ముగిసిన తరువాత ఆ వెంట్రుకల్లో మూడో భాగాన్ని పట్టణం మధ్యలో తగలబెట్టు. మిగిలిన మూడో భాగాన్ని పట్టణం చుట్టూ తిరుగుతూ కత్తితో కొట్టు. మిగిలిన మూడో భాగాన్ని గాలికి ఎగిరి పోనీ. నేను కత్తి దూసి ప్రజలను తరుముతాను.

¶ అయితే మీలో కొంత శేషాన్ని నేను భద్రం చేస్తాను. మీరు వివిధ దేశాల్లోకి చెదరిపోయినప్పుడు మీలో కొంతమంది ఖడ్గాన్ని తప్పించుకుంటారు.

¶ కాబట్టి వారు ఉదయాన కనబడే మబ్బులాగా, పెందలకడ ఆరిపోయే ప్రాతఃకాలపు మంచులాగా ఉంటారు. కళ్ళంలో నుండి గాలి ఎగరగొట్టే పొట్టులాగా, పొగ గొట్టంలో గుండా వెళ్ళిపోయే పొగలాగా ఉంటారు.

‹వారు కత్తిపాలై చనిపోతారు. శత్రువులు వారిని చెరపట్టి యూదులు కాని అన్యజనాల్లోకి తీసుకువెళ్తారు. యూదేతర జాతులు తమ కాలాలు పూర్తి అయ్యేవరకూ యెరూషలేమును కాళ్ళ కింద తొక్కుతారు.›