ఆమె ద్వారా అతనికి జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు అనేవాళ్ళు పుట్టారు.
TSK
TSK · యోబు 2:11
مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.
¶ ఏశావు కొడుకుల్లో తెగల నాయకులు ఎవరంటే, ఏశావు మొదటి సంతానమైన ఎలీఫజు కొడుకులు తేమాను, ఓమారు, సెపో, కనజు,
అతని కొడుకులు, కూతుర్లు అందరూ అతణ్ణి ఓదార్చడానికి ప్రయత్నం చేశారు గానీ అతడు ఓదార్పు పొందలేదు. “నేను ఏడుస్తూ చనిపోయిన వారుండే స్థలానికి నా కొడుకు దగ్గరికి వెళ్తాను” అని అతడు యోసేపు కోసం ఏడ్చాడు.
¶ అబ్రాహాము ఉంపుడుకత్తె అయిన కెతూరాకు పుట్టిన కొడుకులు వీళ్ళు: జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకూ, షూవహు. వీళ్ళలో యొక్షానుకు షేబా, దదానూ అనే కొడుకులు పుట్టారు.
అందుకు తేమానీయుడు ఎలీఫజు ఇలా జవాబిచ్చాడు.
తేమా నుండి గుంపులుగా బయలు దేరి వచ్చే వ్యాపారులు వాటి కోసం వెతుకుతారు. షేబ వర్తకులు వాటి కోసం ఆశిస్తారు.
¶ అప్పుడు నయమాతీయుడు జోఫరు ఇలా జవాబు ఇచ్చాడు,
¶ అప్పుడు తేమానీయుడు ఎలీఫజు ఇలా జవాబు ఇచ్చాడు,
నా స్నేహితులు నన్ను ఎగతాళి చేస్తున్నారు. నా కళ్ళు దేవుని కోసం కన్నీళ్లు కారుస్తున్నాయి.
నా ప్రాణస్నేహితులందరూ నన్ను చూసి ఆసహ్యించుకుంటున్నారు. నేను ఇష్టపడిన వాళ్ళు నాకు శత్రువులయ్యారు.
¶ యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడు ఎలీఫజుతో ఇలా చెప్పాడు. “నా సేవకుడైన యోబు పలికినట్టు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు కాబట్టి నా కోపం నీ మీదా నీ ఇద్దరు స్నేహితుల మీదా మండుతున్నది.
¶ అప్పుడు అతని అన్నదమ్ములు, అతని అక్క చెల్లెళ్ళు అంతకుముందు అతనికి పరిచయం ఉన్న వారంతా వచ్చి, అతనితో కలిసి అతని ఇంట్లో భోజనాలు చేశారు. యెహోవా అతని మీదికి రప్పించిన బాధలన్నిటి గూర్చి ఎంత కష్టాల పాలయ్యావు అంటూ అతని కోసం దుఃఖిస్తూ అతణ్ణి ఓదార్చారు. అంతేగాక ఒక్కొక్కడు ఒక వెండి నాణెం, బంగారు ఉంగరం అతనికి ఇచ్చారు.
¶ ఎక్కువ మంది స్నేహితులున్న వాడికి నష్టం. అయితే సోదరుని కన్నా సన్నిహితంగా ఉండే మిత్రులు కూడా ఉంటారు.
రెండు విపత్తులు నీ మీదికి వచ్చాయి. నీతో కలిసి ఎవరు ఏడుస్తారు? ధ్వంసం, నాశనం, కరువు, కత్తి నీ మీదికి వచ్చాయి. నిన్నెవరు ఓదారుస్తారు?
చాలామంది యూదులు మార్త, మరియలను వారి సోదరుని విషయం ఓదార్చడానికి వచ్చి, అక్కడ ఉన్నారు.
కాబట్టి ఒక అవయవం బాధపడితే మిగిలిన అవయవాలన్నీ దానితో కలిసి బాధపడతాయి. ఒకటి ఘనత పొందితే అవయవాలన్నీ దానితో కలిసి సంతోషిస్తాయి.