TSK

TSK · 2 దిన 23:3

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

Back to passage

ఇశ్రాయేలు గోత్రాల పెద్దలంతా హెబ్రోనులో ఉన్న తన దగ్గరికి వచ్చినప్పుడు రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిలో వారితో ఒప్పందం చేసుకున్నాడు. వారు తమపై రాజుగా ఉండేందుకు దావీదుకు పట్టాభిషేకం చేశారు.

నీకైతే నీ సంతానం, నీ రాజ్యం కలకాలం స్థిరంగా ఉంటుంది. నీ సింహాసనం అన్నివేళలా స్థిరంగా ఉంటుంది.”

‘నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండాా పోడు’ అని నీ తండ్రి దావీదుకు నేను మాట ఇచ్చినట్టు ఇశ్రాయేలీయుల మీద నీ సింహాసనాన్ని చిరకాలం స్థిరపరుస్తాను.

¶ వీళ్ళూ వీళ్ళ సోదరులూ కలసి వంశావళి లెక్కల్లో తొమ్మిది వందల యాభై ఆరు మంది అయ్యారు. వీళ్ళంతా తమ తమ వంశాలకు నాయకులుగా ఉన్నారు.

‘నువ్వు నడుచుకున్నట్టు నీ కుమారులు కూడా ప్రవర్తించి, నా ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుంటే ఇశ్రాయేలీయుల సింహాసనం మీద కూర్చుని పాలించేవాడు నా సన్నిధిలో నీకుండకుండా పోడు’ అని నీవు నీ సేవకుడు, నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చిన మాటను ఇశ్రాయేలీయుల దేవా, యెహోవా, దయచేసి నెరవేర్చు.

అయినా యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన బట్టి, అతనికీ అతని కుమారులకూ ఎప్పుడూ జీవమిస్తానని చేసిన వాగ్దానం కోసం దావీదు సంతతిని నాశనం చేయడానికి ఇష్టపడలేదు.

అతని సంతానం శాశ్వతంగా ఉండేలా చేస్తాను ఆకాశమున్నంత వరకూ అతని సింహాసనాన్ని నేను నిలుపుతాను.