TSK

TSK · 2 రాజులు 9:21

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

Back to passage

“ఇది ఎవరివల్ల అవుతుంది?” అని అహాబు అడిగాడు. అందుకు ప్రవక్త “రాజ్యాధిపతుల్లో ఉన్న యువకుల వలన అవుతుందని యెహోవా చెబుతున్నాడు” అన్నాడు. “యుద్ధాన్ని ఎవరు మొదలెట్టాలి?” అని రాజు అడిగాడు. అతడు “నువ్వే” అని జవాబిచ్చాడు.

అది విని యెజెబెలు “నాబోతు బతికి లేడు, చచ్చిపోయాడు. కాబట్టి నీవు లేచి యెజ్రెయేలు వాడైన నాబోతు ఖరీదుకు నీకివ్వనన్న అతని ద్రాక్షతోటను స్వాధీనం చేసుకో” అని అహాబుతో చెప్పింది.

¶ అప్పుడు యెహూ తన దగ్గర అధికారి బిద్కరుని పిలిచి “అతణ్ణి ఎత్తి యెజ్రెయేలు వాడైన నాబోతు పొలంలో పడవేయి. నీకు గుర్తుందా? మనం ఇద్దరం ఇతని తండ్రి అహాబుతో కలసి గుర్రాలెక్కి వచ్చినప్పుడు యెహోవా అతనికి వ్యతిరేకంగా ఈ ప్రవచనాన్ని పలికించాడు

¶ లాకీషు పురవాసులారా, రథాలకు యుద్ధాశ్వాలను పూన్చండి. ఇశ్రాయేలు వారు చేసిన తిరుగుబాట్లు నీలో కనిపించాయి. నువ్వు సీయోను కుమార్తె పాపానికి ప్రారంభం.