TSK

TSK · యెషయా 32:7

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

Back to passage

నీవు దేవుణ్ణి, రాజునూ దూషించావు, అని అతని మీద సాక్ష్యం చెప్పడానికి ఇద్దరు నిజాయితీ లేని మనుషులను ఏర్పాటు చేయండి. తీర్పు అయిన తరువాత అతన్ని బయటికి తీసికెళ్ళి రాళ్లతో కొట్టి చంపేయండి.”

నిరపరాధులను కొట్టాలని రహస్య స్థలాల్లో ఆ బాణాలు సంధిస్తారు. ఏమాత్రం భయపడకుండా వారు అకస్మాత్తుగా వారిని కొడతారు.

నీ అధికారులు ద్రోహులు. వాళ్ళు దొంగలతో సావాసం చేస్తారు. అందరూ లంచం ఆశిస్తారు. చెల్లింపుల వెంటబడతారు. తండ్రి లేని వాళ్ళ పక్షంగా ఉండరు. వితంతువుల న్యాయమైన అభ్యర్ధన వాళ్ళు పట్టించుకోరు.

మీ చేతులు రక్తంతో మీ వేళ్లు అపరాధాలతో మరకలయ్యాయి. మీ పెదవులు అబద్ధాలాడుతున్నాయి. మీ నాలుక ద్వేషంతో మాటలాడుతున్నది.

నా ప్రజల్లో దుర్మార్గులున్నారు, వేటగాళ్ళు పక్షుల కోసం పొంచి ఉన్నట్టు వారు పొంచి ఉంటారు. వారు వల పన్ని మనుషులను పట్టుకుంటారు.

¶ మంచాల మీద పడుకుని మోసపు పనులు ఆలోచిస్తూ దుర్మార్గాలు చేసేవారికి బాధ తప్పదు. వాళ్లకు అధికారముంది కాబట్టి పగటి వెలుతురులో వాళ్ళు అలా చేస్తారు.

భక్తులు దేశంలో లేకుండా పోయారు. ప్రజల్లో యథార్థపరుడు ఒకడూ లేడు. హత్య చేయడానికి అందరూ పొంచి ఉంటారు. ప్రతివాడూ తన తోటి దేశస్థుని వలలో చిక్కించాలని వేటాడుతూ ఉంటాడు.

¶ అప్పుడు పన్నెండు మందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు.

¶ అప్పుడు వారు ‘వీడు మోషే మీదా దేవుని మీదా దూషణ మాటలు పలుకుతుంటే మేము విన్నాము’ అని చెప్పడానికి రహస్యంగా కొంతమందిని కుదుర్చుకున్నారు.