TSK

TSK · విలాప వాక్యములు 5:2

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

Back to passage

దేవా, విదేశీయులు నీ వారసత్వ భూమిలోకి వచ్చేశారు, వాళ్ళు నీ పవిత్రాలయాన్ని అపవిత్రపరచారు. యెరూషలేమును రాళ్ళ కుప్పగా మార్చివేశారు.

అప్పుడు ధనికుల స్థలాలు గొర్రెలకు మేత బీడుగా ఉంటాయి. వారి శిథిలాల్లో గొర్రెపిల్లలు మేస్తాయి.

వారికిక ఏమీ మిగలదు. వారి ఇళ్ళు, వారి పొలాలు, వారి భార్యలు, మొత్తాన్ని ఇతరులు తీసుకు వెళ్లి పోతారు. ఎందుకంటే ఈ దేశ ప్రజల మీద నేను నా చెయ్యి చాపి వారిని ఎదిరిస్తాను. ఇదే యెహోవా వాక్కు

¶ వాటిని ఇతర దేశస్తుల చేతికి అప్పగిస్తాను. దుర్మార్గుల చేతికి దోపిడీ సొమ్ముగా ఇస్తాను. వాళ్ళు వాటిని అపవిత్రం చేస్తారు.

¶ వారి ఆస్తి దోపుడు సొమ్ముగా అవుతుంది. వారి ఇళ్ళు పాడైపోతాయి. వారు ఇళ్ళు కట్టుకుంటారు గాని వాటిలో కాపురముండరు. ద్రాక్షతోటలు నాటుతారు గాని వాటి రసం తాగరు.