TSK

TSK · మత్తయి 8:3

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

Back to passage

¶ దేవుడు “వెలుగు కలుగు గాక” అన్నాడు. వెలుగు కలిగింది.

అప్పుడు అతడు దేవుని మనిషి ఆదేశం ప్రకారం వెళ్ళి యొర్దాను నదిలో ఏడు సార్లు మునిగి లేచాడు. దాంతో అతని శరీరం పూర్తి స్వస్థత పొంది చిన్నపిల్లవాడి శరీరంలా పూర్వ స్థితికి వచ్చింది.

యేసు, ‹“మీరు వెళ్ళి, విన్న వాటినీ చూసిన వాటినీ యోహానుకు తెలియజేయండి.›

ఆయన లేచి గాలిని, సముద్రాన్ని గద్దిస్తూ, ‹“శాంతించు! ఆగిపో!”› అని ఆజ్ఞాపించాడు. వెంటనే గాలి ఆగిపోయింది. అంతా ప్రశాంతంగా మారింది.

అప్పుడు ఆయన ఆకాశం వైపు తల ఎత్తి నిట్టూర్చి, ‹“ఎప్ఫతా”› అని అతనితో అన్నాడు. ఆ మాటకు, ‹“తెరుచుకో!”› అని అర్థం.

అప్పుడు యేసు తన చెయ్యి చాపి అతన్ని తాకి, ‹“నాకిష్టమే. బాగు పడు”› అన్నాడు. వెంటనే అతని కుష్టు వ్యాధి పోయింది.

ఆయన వారిని చూసి, ‹“మీరు వెళ్ళి, యాజకులకు కనపడండి”› అని చెప్పాడు. వారు వెళ్తుండగా కుష్టు రోగం నయమై శుద్ధులయ్యారు.

¶ ఆయన ఈ మాట చెప్పిన తరువాత పెద్ద స్వరంతో కేక వేసి, ‹“లాజరూ, బయటికి రా!”› అన్నాడు.