అమ్మోనీయులు బయలుదేరి తమ నగర సింహద్వారాలకు ఎదురుగా బారులు తీరి నిలబడ్డారు. సోబా నుంచి, రెహోబు నుంచి అరామీయులు, మయకావారు, టోబువారు విడివిడిగా పొలాల్లో కాపు కాశారు.
TSK
TSK · 1 దిన 19:9
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
2 సమూ 10:8
TSK
1 రాజులు 20:1
TSK
¶ సిరియా రాజు బెన్హదదు తన సైన్యాన్నంతా సిద్ధం చేశాడు. అతనితో ఉన్న ముప్ఫై ఇద్దరు రాజులతో గుర్రాలతో రథాలతో బయలుదేరి సమరయను ముట్టడించి దాని మీద యుద్ధం చేశాడు.
2 దిన 13:3
TSK
¶ అబీయాకు యరొబాముకు మధ్య యుద్ధం జరిగింది. అబీయా 4,00,000 మంది పరాక్రమశాలులైన సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చేశాడు. యరొబాము కూడా 8,00,000 మంది పరాక్రమశాలులను అతనికి ఎదురుగా వ్యూహపరిచాడు.
యెషయా 28:6
TSK
ఆయన న్యాయం చెప్పడానికి న్యాయపీఠం పైన కూర్చున్న వాడికి న్యాయం నేర్పే ఆత్మగానూ, తమ ద్వారాల దగ్గర శత్రువులను తరిమి కొట్టే వాళ్లకి బలంగానూ ఉంటాడు.
యోవేలు 2:5
TSK
వాళ్ళు పర్వత శిఖరాల మీద రథాలు పరుగులు పెడుతున్నట్టు వచ్చే శబ్దంతో దూకుతున్నారు. ఎండిన దుబ్బు మంటల్లో కాలుతుంటే వచ్చే శబ్దంలా, యుద్ధానికి సిద్ధమైన గొప్ప సేనలా ఉన్నారు.