TSK

TSK · 1 దిన 23:28

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

¶ మందిరం గోడ చుట్టూ గదులు కట్టించాడు. మందిరం గోడలకు పరిశుద్ధ స్థలం బయటి గోడల వరకూ ఆ గదులు గర్భాలయానికి చుట్టూ నాలుగు వైపులా అతడు కట్టించాడు.

యెహోయాదా కొడుకు బెనాయా కెరేతీయులకూ, పెలేతీయులకూ అధిపతి. ఇంకా, దావీదు కొడుకులు రాజుకు సహాయకులు.

¶ యాజకులూ, లేవీయులూ, సేవ చెయ్యవలసిన వంతుల జాబితా, యెహోవా మందిరపు సేవను గూర్చిన జాబితా, యెహోవా మందిరపు సేవ ఉపకరణాల జాబితా దావీదు అతనికి అప్పగించాడు.

¶ యాజకులు, లేవీయుల్లో సేవ చేసేవారు తప్ప యెహోవా మందిరం లోపలికి ఇంకెవ్వరూ రాకూడదు. వారు ప్రతిష్టితులు కాబట్టి వారు లోపలికి రావచ్చు గాని ప్రజలంతా యెహోవా ఆజ్ఞ ప్రకారం బయటే ఉండాలి.

¶ అప్పుడు వారు రాజ భవనం లోపల ఉన్న రాజైన హిజ్కియా దగ్గరికి పోయి “మేము యెహోవా మందిరమంతా బాగు చేసాం. దహన బలిపీఠాన్ని దాని సామానంతటిని, సన్నిధి రొట్టెలుంచే బల్లనూ బాగు చేసాం.

ఇశ్రాయేలీయులందరికి బోధిస్తూ, యెహోవాకు ప్రతిష్ఠితులైన లేవీయులకు ఇలా ఆజ్ఞాపించాడు “పరిశుద్ధ మందసాన్ని మీరిక మీ భుజాల మీద మోయకుండా, ఇశ్రాయేలీయుల రాజు దావీదు కొడుకు సొలొమోను కట్టించిన మందిరంలో దాన్ని ఉంచండి. మీ దేవుడైన యెహోవాకు ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయులకు సేవ చేయండి.

¶ కాబట్టి మీరు యెరూషలేములో ఉన్న యెహోవా ఆలయం ఖజానా గదుల్లో యాజకుల, లేవీయుల, ఇశ్రాయేలు పెద్దల, ప్రధానుల సమక్షంలో వాటి బరువు తూచి లెక్క అప్పగించేదాకా వీటిని జాగ్రత్తగా ఉంచండి” అని వారితో చెప్పాను.

¶ ఇంతకుముందు మన దేవుని మందిరానికి చెందిన గిడ్డంగిపై అధికారిగా ఉన్న యాజకుడు ఎల్యాషీబు టోబీయాతో బంధుత్వం కలుపుకున్నాడు.

యెహోవా మందిరంలో దైవజనుడైన యిగ్దల్యా కొడుకు, హానాను కొడుకుల గదిలోకి వాళ్ళను తీసుకొచ్చాను. అది రాజుల గదికి దగ్గరలో ఉన్న ద్వారపాలకుడూ, షల్లూము కొడుకు అయిన మయశేయా గదికి పైగా ఉంది.

మరియు వసారాకి, రెండు వైపులా గోడలకు, మేడగదులకు రెండు వైపులా కమ్ములు వేసిన కిటికీలు, ఖర్జూరపు చెట్ల ఆకారాలు చెక్కి ఉన్నాయి.

¶ అప్పుడాయన నాతో ఇలా అన్నాడు. “ఖాళీ స్థలానికి ఎదురుగా ఉన్న ఉత్తరపు గదులు, దక్షిణపు గదులు పవిత్రమైన యాజకులవి. వాటిలోనే యెహోవా సన్నిధికి వచ్చే యాజకులు అతి పరిశుద్ధమైన ఆహారాన్ని తింటారు. అక్కడ వారు అతి పరిశుద్ధ వస్తువులను, అంటే నైవేద్యాన్ని, పాప పరిహారార్థ బలి పశుమాంసాన్ని, అపరాధ పరిహారార్థ బలి పశుమాంసాన్ని ఉంచుతారు. ఆ స్థలం అతి పరిశుద్ధం.