TSK

TSK · ద్వితీ 27:3

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

¶ నేను మీతో చెప్పాను. మీరు వారి భూమిని వారసత్వంగా పొందుతారు. పాలు తేనెలు ప్రవహించే ఆ దేశాన్ని మీరు స్వాధీన పరచుకునేందుకై మీకిస్తాను. జాతుల్లో నుండి మిమ్మల్ని వేరు చేసిన మీ దేవుడైన యెహోవాను నేనే.

యెహోవా మనలను బట్టి ఆనందిస్తే, ఆ ప్రదేశంలో మనలను చేర్చి, దాన్ని మనకు ఇస్తాడు. అది పాలు తేనెలు ప్రవహించే ప్రదేశం.

¶ అవి మీ రెండు కళ్ళ మధ్యలో బాసికం లాగా ఉండాలి.

¶ యెహోవా మాట వినకపోవడం వల్ల వారికి ఏ దేశాన్ని ఇస్తానని వారి పితరులతో యెహోవా ప్రమాణం చేశాడో, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తాను వారికి ఇంక చూపించనని ప్రమాణం చేసినందువల్ల ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ నశించే వరకూ ఇశ్రాయేలీయులు నలభై సంవత్సరాలు అరణ్యంలో సంచరిస్తూ ఉండిపోయారు.

అందుకు నేను “యెహోవా, అలాగే జరుగు గాక” అన్నాను.

¶ ‘మీకు ఇస్తాను’ అని వాళ్ళ పితరులకు ప్రమాణం చేసి, పాలు తేనెలు ప్రవహించే ఈ దేశాన్ని వాళ్లకు ఇచ్చావు.

¶ కానీ ఇప్పుడు క్రీస్తు మరింత మేలైన పరిచర్యను పొందాడు. ఎందుకంటే శ్రేష్ఠమైన వాగ్దానాలపై ఏర్పడిన శ్రేష్ఠమైన ఒప్పందానికి ఈయన మధ్యవర్తిగా ఉన్నాడు.