¶ యెహోవా అలాంటివాణ్ణి క్షమించడు. యెహోవా కోపం, రోషం అతని మీద రగులుకుంటుంది. ఈ గ్రంథంలో రాసి ఉన్న శాపాలన్నీ వాడికి ప్రాప్తిస్తాయి. యెహోవా అతని పేరు ఆకాశం కింద ఉండకుండాా తుడిచి వేస్తాడు.
TSK
TSK · ద్వితీ 32:22
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
అప్పుడు భూమి కంపించి వణికింది. దేవుడు కోపంగా ఉన్నాడు గనక పర్వతాల పునాదులు కూడా కదిలి వణికాయి.
కాబట్టి భూమి మారిపోయినా, సముద్ర అఖాతంలో పర్వతాలు మునిగిపోయినా మేము భయపడం.
నా పట్ల నీ కృప ఎంతో గొప్పది. చచ్చిన వాళ్ళుండే అగాధం నుంచి నా ప్రాణాన్ని తప్పించావు.
యెహోవా, ఆకాశాలను కృంగజేసి కిందికి దిగిరా. పర్వతాలను తాకి అవి పొగలు వెళ్ళగక్కేలా చెయ్యి.
భూమి బొత్తిగా బద్దలై పోతున్నది. భూమి కేవలం ముక్కలై పోతున్నది. భూమి బ్రహ్మాండంగా దద్దరిల్లుతున్నది.
పర్వతాలు కూలిపోయినా కొండలు కదిలినా నా కృప నీనుంచి తొలగిపోదు. నా శాంతి ఒడంబడిక, నిన్ను విడిచిపోదు” అని నీ మీద జాలిపడే యెహోవా చెబుతున్నాడు.
¶ యూదా, యెరూషలేము ప్రజలారా, మీ హృదయాలకు సున్నతి చేసుకోండి. మీ దుష్టక్రియలను బట్టి నా కోపం అగ్నిలాగా మండుతున్నది. దాన్ని ఎవరూ ఆర్పివేయలేరు. కాబట్టి యెహోవాకు లోబడి ఉండండి.
నేను నీకిచ్చిన స్వాస్థ్యాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. మీరు నా కోపాగ్ని రగులబెట్టారు. అది ఎప్పటికీ మండుతూ ఉంటుంది. నీవెరుగని దేశంలో నీ శత్రువులకు నువ్వు బానిసవవుతావు.
¶ తీవ్రమైన కోపంతో ఆయన ఇశ్రాయేలు ప్రజల బలాన్ని అణచివేశాడు. శత్రువుల ముందు ఆయన తన కుడి చెయ్యి వెనక్కు తీసుకున్నాడు. చుట్టూ ఉన్న వాటన్నిటినీ కాల్చే రగులుతున్న అగ్నిజ్వాలలు కాల్చినట్టు ఆయన యాకోబును కాల్చేశాడు.
¶ యెహోవా తన కోపం తీర్చుకున్నాడు. తన కోపాగ్ని కుమ్మరించాడు. ఆయన సీయోనులో అగ్ని రాజేశాడు. అది దాని పునాదులను కాల్చేసింది.
మిమ్మల్ని పోగు చేసి నా కోపాగ్నిని మీ మీద ఊదినప్పుడు కచ్చితంగా మీరు దానిలో కరిగిపోతారు.
¶ యెహోవాను ఆశ్రయించి జీవించండి. లేకపోతే ఆయన యోసేపు వంశం మీద నిప్పులాగా పడతాడు. అది దహించి వేస్తుంది. బేతేలులో ఎవరూ దాన్ని ఆర్పలేరు.
¶ ఆయనపట్ల కలిగిన భయం వల్ల పర్వతాలు కదిలిపోతాయి. కొండలు కనిపించకుండా కరిగి పోతాయి. ఆయన ఎదుట నిలువలేక భూమి వణికిపోతుంది. భూమి, దానిపై నివసించేవారంతా ఆయన అంటే భయపడతారు.
¶ యెహోవా ఉగ్రత దినాన వారి వెండి బంగారాలు వారిని తప్పించలేకపోతాయి. రోషాగ్నిచేత భూమంతా దహనం అవుతుంది. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వ నాశనం చేయబోతున్నాడు.
¶ సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఇలా చెబుతున్నాడు. “నియమిత దినం రాబోతుంది. అది కాలుతూ ఉన్న కొలిమిలాగా ఉంటుంది. గర్విష్ఠులంతా, దుర్మార్గులంతా ఎండుగడ్డిలాగా ఉంటారు. వారిలో ఒక్కరికి కూడా వేరు గానీ, చిగురు గానీ ఉండదు. రాబోయే ఆ దినాన అందరూ తగలబడి పోతారు.
‹నీ కన్ను నీకు ఆటంకంగా ఉంటే దాన్ని పెరికి దూరంగా పారవెయ్యి. రెండు కళ్ళు కలిగి నరకంలో పడడం కంటే ఒకే కంటితో జీవంలో ప్రవేశించడం నీకు మంచిది.›
¶ ‹మీరు పాపం చేయడానికి మీ చెయ్యి కారణమైతే దాన్ని నరికివేయండి! రెండు చేతులుండి, నరకంలోని ఆరని అగ్నిలోకి పోవడం కంటే ఒక చెయ్యి లేకుండా నిత్యజీవంలో ప్రవేశించడం మీకు మేలు.›
ఎందుకంటే మన దేవుడు దహించే అగ్ని.