¶ యెహోవా మిమ్మల్నీ, మీ మీద నియమించుకునే మీ రాజునూ, మీరూ మీ పూర్వీకులూ ఎరగని వేరే దేశప్రజలకు అప్పగిస్తాడు. అక్కడ మీరు చెక్క ప్రతిమలను, రాతిదేవుళ్ళనూ పూజిస్తారు.
TSK
TSK · ద్వితీ 4:27
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
¶ మీకు మేలు చేయడంలో, మిమ్మల్ని అభివృద్ది చేయడంలో మీ యెహోవా దేవుడు మీపట్ల ఎలా సంతోషించాడో అలాగే మిమ్మల్ని నాశనం చెయ్యడానికి, మిమ్మల్ని హతమార్చడానికి యెహోవా సంతోషిస్తాడు. మీరు స్వాధీనం చేసుకోడానికి ప్రవేశిస్తున్న దేశం నుంచి తొలగించి వేస్తాడు.
నీ సేవకుడైన మోషేకు నీవు చెప్పిన మాట గుర్తు చేసుకో. ‘మీరు అపరాధం చేస్తే లోక జాతుల్లోకి మిమ్మల్ని చెదరగొట్టి వేస్తాను.
¶ కాబట్టి వాళ్ళకి ఇలా చెప్పు. “ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు, దూరంగా ఉన్న జాతుల్లోకి నేను వారిని తొలగించినా, ఇతర దేశాల్లోకి వాళ్ళని నేను చెదరగొట్టినా వాళ్ళు చెదరిపోయిన దేశాల్లో నేను వారికి కొంతకాలం పరిశుద్ద ఆలయంగా ఉంటాను”
¶ వాళ్ళు నా విధులు అనుసరించకుండా, నా కట్టడలు తృణీకరించి, నేను విధించిన విశ్రాంతిదినాలను అపవిత్రం చేసి,
¶ వారు నా దేవుని మాట వినలేదు గనక ఆయన వారిని విసర్జించాడు. వారు దేశం విడిచి అన్యజనుల్లో దేశదిమ్మరులౌతారు.