TSK

TSK · యెషయా 59:10

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

ఒకడు గుడ్డివాడుగా చీకట్లో వెతుకుతున్నట్టు మీరు మధ్యాహ్న సమయంలో వెతుకుతారు. మీరు చేసే పనుల్లో అభివృద్ది చెందరు. ఇతరులు మిమ్మల్ని అణిచివేస్తారు, దోచు కుంటారు. ఎవ్వరూ మిమ్మల్ని కాపాడలేరు.

¶ దుష్టుల మార్గం చీకటిమయం. వాళ్ళు ఎక్కడెక్కడ పడిపోతారో వాళ్ళకే తెలియదు.

మీ దేవుడైన యెహోవా చీకటి కమ్మజేయక ముందే, చీకటిలో మీ కాళ్లు కొండలపై తొట్రుపడక ముందే, ఆయనను ఘనపరచి కొనియాడండి. ఎందుకంటే మీరు వెలుగు కోసం చూస్తుండగా ఆయన దాన్ని గాఢాంధకారంగా మారుస్తాడు.

¶ ఇప్పుడు వాళ్ళు గుడ్డివాళ్ళలా వీధుల్లో తిరుగుతున్నారు. వాళ్ళు రక్తం అంటిన అపవిత్రులు. అందుకే ఎవరూ వాళ్ళ వస్త్రాలైనా ముట్టలేక పోతున్నారు.

¶ అందుకు యేసు జవాబిస్తూ, ‹“పగలు పన్నెండు గంటల వెలుగు ఉండదా? ఒకడు పగటి వేళ నడిస్తే తడబడడు. ఎందుకంటే అతడు వెలుగులో అన్నీ చూస్తాడు.›

“ఆయన వారి కళ్ళకు గుడ్డితనం కలగజేశాడు. ఆయన వారి హృదయాలను కఠినం చేశాడు. అలా చెయ్యకపోతే వారు తమ కళ్ళతో చూసి, హృదయాలతో గ్రహించి, నా వైపు తిరిగేవారు. అప్పుడు నేను వారిని బాగు చేసేవాణ్ణి.”