TSK

TSK · యెషయా 60:19

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

ఆయనే మీ స్తుతికి పాత్రుడు. మీరు కళ్ళారా చూస్తుండగా భీకరమైన గొప్ప కార్యాలు మీ కోసం చేసిన మీ దేవుడు ఆయనే.

మనుషులారా, ఎంతకాలం నా కీర్తిని అవమానంగా మారుస్తారు? ఎంతకాలం పనికిరాని వాటిని ప్రేమించి అబద్ధాల వెంటబడతారు? సెలా.

దేవునిలోనే నా రక్షణ, నా మహిమ. నా బలమైన దుర్గం, నా ఆశ్రయం ఆయనలోనే ఉన్నాయి.

చంద్రుడు వెలవెలబోతాడు. సూర్య బింబం మారిపోతుంది. సేనల ప్రభువైన యెహోవా సీయోను కొండ మీదా యెరూషలేములో రాజవుతాడు. పెద్దల ఎదుట ఆయన ప్రభావం కనబడుతుంది.

నేను ఆ ప్రజలకు వ్యతిరేకంగా నా చెయ్యి ఎత్తుతాను. వారిని వారి దాసులు దోచుకుంటారు. అప్పుడు సేనల ప్రభువు యెహోవా నన్ను పంపించాడని మీరు తెలుసుకుంటారు.

¶ ఆ పట్టణంలో వెలుగివ్వడానికి సూర్యుడూ చంద్రుడూ అక్కరలేదు. దేవుని యశస్సు అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది. గొర్రెపిల్ల దాని దీపం.