TSK

TSK · యిర్మీయా 18:13

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

రాజ గృహనిర్వాహకుడు, హిల్కీయా కొడుకు అయిన ఎల్యాకీము, శాస్త్రి షెబ్నా, రాజ్యందస్తావేజుల మీద అధికారి, ఆసాపు కొడుకు యోవాహు తమ బట్టలు చింపుకుని హిజ్కియా దగ్గరికి వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నిటినీ తెలియజేశారు.

కిత్తీయుల ద్వీపాలకు వెళ్లి చూడండి, కేదారుకు దూతలను పంపి విచారించండి. మీలో జరుగుతున్న ప్రకారం ఇంకెక్కడైనా జరుగుతున్నదా?

యెరూషలేము ప్రవక్తల మధ్య ఘోరమైన పనులు నేను చూశాను. వాళ్ళు వ్యభిచారులు. మోసంలో నడుస్తున్నారు. వాళ్ళు దుర్మార్గుల చేతులను బలపరుస్తున్నారు! ఎవడూ తన దుర్మార్గం విడిచిపెట్టడం లేదు. వాళ్ళంతా నా దృష్టికి సొదొమ ప్రజల్లాగా మారారు. యెరూషలేము నివాసులు గొమొర్రా ప్రజల్లాగా మారారు.

¶ నాకు అండగా నిలిచిన శూరులను ఆయన విసిరి పారేశాడు. నా శక్తిమంతులను అణగదొక్కడానికి ఆయన నాకు వ్యతిరేకంగా ఒక సమాజాన్ని లేపాడు. ద్రాక్షగానుగలో వేసి ద్రాక్షలు తొక్కినట్టు ప్రభువు, కన్యక అయిన యూదా కుమారిని తొక్కాడు.

¶ ఇశ్రాయేలు ప్రజలారా, మిమ్మల్ని గురించి నేను దుఃఖంతో చెప్పే ఈ మాట వినండి.

¶ మీ మధ్య వ్యభిచారం ఉన్నదని మేము విన్నాం. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట గదా. ఇలాటి వ్యభిచారం యూదేతరుల్లో సైతం కనిపించదు.