TSK

TSK · యిర్మీయా 5:2

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

యూదా సంతానమా! యాకోబు వంశమా! ఈ మాట విను. నిన్ను ఇశ్రాయేలు అనే పేరుతో పిలుస్తున్నారు. నువ్వు యెహోవా నామం తోడని ప్రమాణం చేస్తావు. ఇశ్రాయేలు దేవుని పేరు స్మరిస్తావు. అయితే యథార్థంగా నిజాయితీతో అలా చేయవు.

¶ ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవా మాట ఆలకించండి. సత్యం, కనికరం, దేవుణ్ణి గూర్చిన జ్ఞానం దేశంలో లేకపోవడం చూసి. యెహోవా దేశనివాసులతో వ్యాజ్యెమాడుతున్నాడు.

¶ ఇశ్రాయేలూ, నీవు వేశ్యవైపోయావు. అయినా యూదా ఆ పాపంలో పాలు పొందక పోవుగాక. మీరు గిల్గాలు వెళ్లొద్దు. బేతావెనుకు పోవద్దు. యెహోవా జీవం తోడని ప్రమాణం చేయవద్దు.

అప్పుడు అతడు నాతో “ఇది భూమి అంతటి మీదికీ బయలుదేరి వెళ్తున్న శాపం. దానికి ఒక వైపు రాసి ఉన్న ప్రకారం దొంగతనం చేసేవాళ్ళు నాశనం అవుతారు, రెండవ వైపు రాసి ఉన్న ప్రకారం అబద్ద సాక్ష్యాలు పలికేవాళ్ళంతా నాశనం అవుతారు” అని చెప్పాడు.

వ్యభిచారులూ స్వలింగ సంపర్కులూ బానిస వ్యాపారులూ అబద్ధికులూ అబద్ధ సాక్ష్యం చెప్పేవారూ నిజమైన బోధకు వ్యతిరేకంగా నడచుకొనేవారూ ఇలాటివారి కోసమే ధర్మశాస్త్రం ఉంది అని మనకు తెలుసు.

దేవుడు తమకు తెలుసని వారు చెప్పుకొంటారు గాని తమ క్రియల వలన దేవుడెవరో తమకు తెలియదు అన్నట్టు ఉన్నారు. నిజానికి వారు అసహ్యులు, అవిధేయులు, ఎలాంటి సత్కార్యం విషయంలోనూ పనికి రానివారు.