TSK

TSK · యిర్మీయా 6:2

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

సీయోను కుమార్తె ద్రాక్షతోటలో ఒక గుడిసెలాగా, దోసపాదుల్లో ఒక పాకలాగా, ముట్టడి వేసిన పట్టణంలాగా మిగిలిపోయింది.

స్త్రీ పురిటినొప్పులతో కేకలు వేస్తున్నట్టు, తొలి కాన్పులో స్త్రీ కేకలు వేస్తున్నట్టు సీయోను కన్య “అయ్యో, నాకు బాధ! నా హంతకుల చేతిలో చిక్కి నేను మూర్చబోతున్నాను” అని ఎగశ్వాసతో చేతులు చాస్తూ వేస్తున్న కేకలు నాకు వినబడుతున్నాయి.

¶ యెరూషలేము కుమారీ, నీ గురించి నేనేమనాలి? నిన్ను దేనితో పోల్చి ఆదరించాలి? సీయోను కుమారీ, కన్యకా, నీ పతనం సముద్రమంత విస్తారమైనది. నిన్ను స్వస్థపరచగల వాడెవడు?