¶ ఆ తరం వారంతా తమ తమ పితరుల దగ్గరికి చేరారు. వారి తరువాత యెహోవానుగాని, ఆయన ఇశ్రాయేలీయుల కోసం చేసిన కార్యాలను గాని తెలియని తరం ఒకటి మొదలయ్యింది.
TSK
TSK · యిర్మీయా 9:2
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
త్వరగా పారిపోయి అరణ్యంలో నివసిస్తాను.
మీ చేతులు రక్తంతో మీ వేళ్లు అపరాధాలతో మరకలయ్యాయి. మీ పెదవులు అబద్ధాలాడుతున్నాయి. మీ నాలుక ద్వేషంతో మాటలాడుతున్నది.
యెహోవా చెప్పేదేమంటే “యెరూషలేము వీధుల్లో అటూ ఇటూ తిరుగుతూ గమనించండి. దాని రాజవీధుల్లో విచారించండి. న్యాయం జరిగిస్తూ నమ్మకంగా ఉండాలని ప్రయత్నం చేసే ఒక్కడు మీకు కనిపించినా సరే, నేను దాన్ని క్షమిస్తాను.
నీ పిల్లలు నన్ను విడిచి, దేవుళ్ళు కాని వారి పేరున ప్రమాణం చేస్తారు. నేను వారిని సమృద్ధిగా పోషించాను కానీ వారు వ్యభిచారం చేస్తూ వేశ్యల ఇళ్ళలో సమావేశం అవుతారు. వారిని నేనెందుకు క్షమించాలి?
నీ సోదరులు, నీ తండ్రి ఇంటివారు సైతం నిన్ను మోసం చేసి అల్లరి చేశారు. వారు నీతో ఎంత దయగా మాటలాడినా నువ్వు వారిని నమ్మవద్దు.
¶ తండ్రి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకునేవాళ్ళు నీలో ఉన్నారు. రుతుస్రావం వల్ల అశుద్ధంగా ఉన్న స్త్రీని చెరిచే వాళ్ళు నీలో కాపురం ఉన్నారు.
¶ వారు యెహోవాకు విశ్వాసఘాతకులయ్యారు. అక్రమ సంతానాన్ని కన్నారు. ఇక ఇప్పుడు వారి అమావాస్య పర్వదినాలు వారి పొలాలతో సహా వారిని మింగేస్తాయి.
¶ వారంతా కాముకులే. రొట్టెలు కాల్చే వాడు ముద్ద పిసికిన తరువాత. ముద్దంతా పొంగే దాకా పొయ్యిని బాగా వేడిచేసి. ఊరుకున్నట్టు వారంతా కాముకులే.
¶ దాని ప్రవక్తలు పెంకెతనం గలవారు, విశ్వాస ఘాతకులు. దాని యాజకులు ధర్మశాస్త్రాన్ని నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరిచేవారు.
కులటలారా, లోకంతో స్నేహం చేయడం అంటే దేవునితో శత్రుత్వమని మీకు తెలియదా? దాన్ని బట్టి ఈ లోకంతో స్నేహం చేయాలనుకునేవాడు దేవునికి శత్రువు అవుతాడు.