TSK

TSK · 2 దిన 20:22

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

Back to passage

ఏడవసారి యాజకులు బూరలు ఊదగానే యెహోషువ ప్రజలకి ఇలా ఆజ్ఞాపించాడు “కేకలు వేయండి, యెహోవా ఈ పట్టణాన్ని మీకు అప్పగించాడు.”

¶ బెన్యామీనీయుల ప్రాంతమైన గిబియాలో ఉన్న సైనికులు చెదిరిపోయి పూర్తిగా ఓడిపోవడం సౌలు గూఢచారులు చూసి ఆ సమాచారం సౌలుకు తెలిపారు.

స్తుతికి అర్హుడైన యెహోవాకు నేను మొర్రపెట్టాను. నా శత్రువుల చేతిలోనుండి నేను తప్పించుకుంటాను.

¶ వారితో బాటు 120 మంది బాకాలు ఊదే యాజకులు నిలబడ్డారు. బూరలూదే వారూ గాయకులూ ఒకేసారి యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ గానం చేసినప్పుడు యాజకులు పరిశుద్ధస్థలం నుండి బయటికి వెళ్ళి ఆ బాకాలతో తాళాలతో ఇతర వాద్యాలతో కలిసి గొంతెత్తి “యెహోవా దయ గలవాడు. ఆయన కృప నిత్యమూ ఉంటుంది” అని స్తోత్రం చేశారు.

అప్పుడు యూదా వారు గట్టిగా కేకలు వేశారు. వారు కేకలు వేస్తుండగా యరొబాము, ఇశ్రాయేలు వారంతా అబీయా ఎదుటా యూదావారి ఎదుటా నిలబడ లేకుండేలా దేవుడు వారిని దెబ్బ తీశాడు.

మరణ పాశాలు నన్ను చుట్టుకున్నాయి, దుర్మార్గులు వరద ప్రవాహంలా నా మీద పడి నన్ను అణిచివేస్తున్నారు

“నేను ఐగుప్తు ప్రజలకు వ్యతిరేకంగా ఐగుప్తు ప్రజలను రేపుతాను. సోదరుడికి వ్యతిరేకంగా సోదరుడూ, పొరుగువాడికి వ్యతిరేకంగా పొరుగువాడూ పోరాటం చేస్తారు. పట్టణంతో పట్టణం, రాజ్యంతో రాజ్యం యుద్ధం చేస్తాయి.