TSK

TSK · ఆది 22:2

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

Back to passage

అప్పుడు దేవుడు ఇలా అన్నాడు. “అలా కాదు. నీ భార్య అయిన శారా కచ్చితంగా నీకు కొడుకుని కంటుంది. అతనికి నువ్వు ఇస్సాకు అనే పేరు పెడతావు. అతనితో నా నిబంధనను స్థిరం చేస్తాను. అతని తరువాత అతని వారసులందరికీ అది శాశ్వతమైన నిబంధనగా ఉంటుంది.

అయితే దేవుడు “ఈ అబ్బాయి కోసం, నీ దాసీ కోసం నువ్వు బాధ పడవద్దు. ఈ విషయంలో శారా నీకు చెప్పినట్టు చెయ్యి. ఎందుకంటే ఇస్సాకు వలన కలిగే సంతానమే నీకు వారసులౌతారు.

“నువ్వు నీ ఒక్కగానొక్క కొడుకుని ఇవ్వడానికి వెనుకంజ వేయకుండా ఇదంతా చేశావు. అందుకే ప్రమాణం చేస్తున్నాను.

ఆ రెండు నెలల తరువాత ఆమె తన తండ్రి దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు అతడు తాను మొక్కు కొన్న మొక్కుబడి ప్రకారం ఆమెకు చేశాడు.

¶ తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి దావీదుకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు అతడు మోరీయా పర్వతంపై సిద్ధం చేసిన స్థలం లో ఒర్నాను అనే యెబూసీయుడికి చెందిన కళ్ళంలో యెహోవా మందిరం కట్టించడం మొదలుపెట్టాడు.

¶ “దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. తద్వారా ఆయనలో విశ్వాసం ఉంచే ప్రతి వాడూ నశించకుండా నిత్యజీవం పొందుతాడు.

తన సొంత కుమారుణ్ణి మనకీయడానికి సంకోచించక మనందరి కోసం ఆయనను అప్పగించిన దేవుడు ఆయనతోబాటు అన్నిటినీ మనకీయకుండా ఉంటాడా?

దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించి, ఆయన ద్వారా మనం జీవించాలన్నది ఆయన ఉద్దేశం. దీని ద్వారా దేవుని ప్రేమ మన మధ్య వెల్లడి అయ్యింది.