TSK

TSK · ఆది 25:28

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

Back to passage

దాన్ని నాకోసం రుచికరంగా వండి తీసుకురా. నాకిష్టమైన వంటకాలు సిద్ధం చేసి పట్టుకు వస్తే నేను చనిపోక ముందు వాటిని తిని నిన్ను ఆశీర్వదిస్తాను” అన్నాడు.

నువ్వు మంద దగ్గరికి వెళ్ళి రెండు మంచి మేక పిల్లలను పట్టుకుని రా. నేను వాటితో మీ నాన్నఇష్టపడే విధంగా రుచిగా భోజనం తయారు చేస్తాను.

దానికి యాకోబు “నేను ఏశావుని. నీ పెద్ద కొడుకుని. నువ్వు నాకు చెప్పినట్టే చేశాను. లేచి నేను వేటాడి తెచ్చిన దాన్ని తిని నన్ను ఆశీర్వదించు” అన్నాడు.

అతడు కూడా రుచికరమైన ఆహారం సిద్ధం చేసి తన తండ్రి దగ్గరికి తెచ్చాడు. “నాన్నా, నీ కొడుకు వేటాడి తెచ్చిన దాన్ని తిని నన్ను ఆశీర్వదించు” అని తండ్రితో అన్నాడు.