TSK

TSK · ఆది 48:19

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

Back to passage

¶ అప్పుడు యెహోవా ఆమెతో ఇలా చెప్పాడు. “రెండు జాతులు నీ గర్భంలో ఉన్నాయి. రెండు గోత్రాలు నీ గర్భంలో నుండే వేరుగా వస్తాయి. ఒక జాతి కంటే ఒక జాతి బలంగా ఉంటుంది. పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు.”

ఇశ్రాయేలు, చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడిచేతిని, మనష్షే తలమీద తన ఎడమచేతిని ఉంచాడు.

ఎఫ్రాయిము సైన్యంగా నమోదైన వారు 40, 500 మంది పురుషులు.

తొలిచూలు ఎద్దు ఠీవి అతనికుంది. అతని కొమ్ములు అడవి ఎద్దు కొమ్ములు. వాటితో అతడు ప్రజలను భూదిగంతాలకు తోలివేస్తాడు. వీరంతా ఎఫ్రాయింకు చెందిన వేలమంది. మనష్షేకు చెందిన వేలమంది.

యెహోవా నీ పైకి, నీ జాతి పైకి, నీ పితరుల కుటుంబం వారి మీదికి బాధ దినాలను, ఎఫ్రాయిము యూదా నుండి వేరైపోయిన దినం మొదలు నేటి వరకూ రాని దినాలను రప్పిస్తాడు. ఆయన అష్షూరు రాజును నీపైకి రప్పిస్తాడు.