TSK

TSK · ఆది 49:29

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

Back to passage

కాని, నువ్వు నీ తండ్రుల దగ్గరికి ప్రశాంతంగా చేరుకుంటావు. పండు ముసలితనంలో నువ్వు మరణించగా నిన్ను పాతిపెడతారు.

ఆ విధంగా ఆ పొలాన్నీ, దాంట్లో ఉన్న గుహనీ శ్మశానం కోసం అబ్రాహాముకు హేతు సంతతి వారు ఇవ్వడం వల్ల అవి అతని సొంతం అయ్యాయి.

¶ అతని కొడుకులు ఇస్సాకూ, ఇష్మాయేలూ కలసి మమ్రే ఎదురుగా ఉన్న మక్పేలా గుహలో అతణ్ణి పాతి పెట్టారు. అది హిత్తీయుడైన సోహరు కుమారుడు ఎఫ్రోనుకు చెందిన పొలంలో ఉంది.

ఇస్సాకు కాలం నిండిన వృద్ధుడై చనిపోయి తన పూర్వికుల దగ్గరికి చేరిపోయాడు. అతని కొడుకులు ఏశావు, యాకోబు అతణ్ణి సమాధి చేశారు.

యాకోబు విషయంలో అతడు వారికి చెప్పినట్లు అతని కొడుకులు చేశారు.

నేను నా ఊరిలోనే ఉండి, చనిపోయి నా తలిదండ్రుల సమాధిలో పాతిపెట్టబడడానికి అక్కడికి తిరిగి వెళ్ళడానికి నాకు అనుమతి ఇవ్వు. అయ్యా, విను. నీ దాసుడు కింహాము ఇక్కడ ఉన్నాడు. నా ఏలినవాడవు, రాజువు అయిన నీతో కలసి రావడానికి అనుమతి ఇవ్వు. నీకు ఏది మంచి అనిపిస్తే అది అతడిపట్ల చెయ్యి” అని మనవి చేశాడు.

పరలోకంలో నమోదు అయిన జ్యేష్టుల సమాజం దగ్గరకూ, అందరికీ న్యాయమూర్తి అయిన దేవుని దగ్గరకూ సంపూర్ణత పొందిన నీతిమంతుల ఆత్మల దగ్గరకూ మీరు వచ్చారు.