TSK

TSK · యెషయా 23:8

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

Back to passage

వారు యెహోవా ఈ దేశాన్ని ఎందుకిలా చేశాడు? ఇంత తీవ్రమైన కోపానికి కారణం ఏమిటి? అని చెప్పుకుంటారు.

నా యజమాని సేవకుల్లో తక్కువ వాడైన ఒక్క అధిపతిని నువ్వు ఎదిరించగలవా? రథాలను, రౌతులను పంపుతాడని ఐగుప్తురాజు మీద ఆశ పెట్టుకున్నావా?

నరపుత్రుడా, తూరు రాజ్యం పాలించే వాడితో ఇలా చెప్పు. “యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, నువ్వు అహంకారంతో, ‘నేను దేవుణ్ణి. సముద్రాల మధ్యలో దేవుడు కూర్చునే చోట నేను కూర్చుంటాను’ అంటున్నావు. నువ్వు మనిషివే. దేవుడివి కావు. నీకు దేవుని మనస్సు ఉందని నువ్వనుకుంటున్నావు.

¶ తూరు పట్టణం వారు ప్రాకారాలు గల కోట కట్టుకుని, ఇసుక రేణువులంత విస్తారంగా వెండిని, వీధుల్లోని కసువంత విస్తారంగా బంగారాన్ని సమకూర్చుకున్నారు.