TSK

TSK · యెషయా 3:25

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

Back to passage

రెమల్యా కొడుకు పెకహు ఇశ్రాయేలు రాజు యూదా సైనికుల్లో పరాక్రమశాలురైన 1, 20,000 మందిని ఒక్కరోజే చంపేసాడు. యూదా వారు తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టినందువల్ల అలా జరిగింది.

తిరస్కరించి తిరుగుబాటు చేస్తే, కత్తి మిమ్మల్ని నాశనం చేస్తుంది.” యెహోవా నోరు ఈ మాట పలికింది.

పొలంలోకి వెళ్లి చూసినప్పుడు కత్తితో చచ్చిన వాళ్ళు కనిపిస్తున్నారు. పట్టణంలోకి వెళ్లి చూస్తే కరువుతో అలమటించే వాళ్ళు కనిపిస్తున్నారు. ప్రవక్తలూ యాజకులూ తెలివిలేక తిరుగుతున్నారు.”

ఈ స్థలం లోనే యూదావారి ఆలోచనను యెరూషలేమువారి ఆలోచనను నేను వ్యర్ధం చేస్తాను. తమ శత్రువుల ఎదుట కత్తిపాలయ్యేలా చేస్తాను. తమ ప్రాణాలను తీయాలని చూసే వాళ్ళ చేతికి అప్పగిస్తాను. వాళ్ళ శవాలను రాబందులకూ అడవి జంతువులకూ ఆహారంగా ఇస్తాను.

¶ యువకులూ, వృద్ధులూ వీధుల్లో నేల మీద పడి ఉన్నారు. నా కన్యకలూ, నా యోధులూ కత్తి చేత కూలి పోయారు. నీ ఉగ్రత దినాన నువ్వు వాళ్ళను హతం చేశావు. జాలి లేకుండా వాళ్ళందరినీ నువ్వు చంపావు.