TSK

TSK · యెషయా 31:4

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

Back to passage

మీరు ఊరికే నిలబడి ఉండండి. మీ పక్షంగా యెహోవా యుద్ధం చేస్తాడు” అని ప్రజలతో చెప్పాడు.

¶ దేవుడు ఐగుప్తులోనుంచి అతన్ని రప్పించాడు. అతనికి అడవిదున్నకు ఉన్నంత బలం ఉంది. అతడు తనకు విరోధంగా పోరాడే వారిని మింగేస్తాడు. వారి ఎముకలు విరిచేస్తాడు. తన బాణాలతో వారిని చంపేస్తాడు.

యెహోవా మీద నమ్మకం ఉంచేవాళ్ళు సీయోను పర్వతంలాగా నిశ్చలంగా శాశ్వతంగా నిలిచి ఉంటారు.

గొప్పవాడైన ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నీ మధ్య ఉన్నాడు గనుక, సీయోను నివాసీ, అరిచి సంతోషంతో కేకలు పెట్టు.”

యెహోవా తాను నియమించిన కర్రతో అష్షూరు పై వేసే ప్రతి దెబ్బా, ఆయన వాళ్ళతో యుద్ధం చేస్తుండగా, తంబురాల, సితారాల సంగీతంతో కలసి ఉంటుంది.

యెహోవా శూరునిలాగా బయటికి కదిలాడు. యోధునిలాగా రోషంతో ఆయన బయలుదేరాడు. తన శత్రువులను ఎదిరిస్తూ ఆయన హుంకరిస్తాడు. వారికి తన శూరత్వాన్ని కనపరుస్తాడు.

¶ వారు యెహోవా వెంట నడుస్తారు. సింహం గర్జించినట్టు నేను గర్జిస్తాను. నేను గర్జించగా పశ్చిమ దిక్కున ఉన్న ప్రజలు వణకుతూ వస్తారు.

యెహోవా చెప్పేది ఏమిటంటే, నేనే దాని చుట్టూ అగ్నికీలలతో సరిహద్దుగా ఉంటాను. నేను ఆ పట్టణం మధ్య నివసిస్తూ దానికి మహిమ కలిగిస్తాను.

¶ సేనల ప్రభువు యెహోవా వారిని కాపాడుతాడు గనక వారు భక్షిస్తూ వడిసెలరాళ్లను అణగ దొక్కుతూ వస్తారు. ద్రాక్షారసం తాగుతూ, తాగడం మూలంగా సింహనాదాలు చేస్తూ, బలిపీఠపు మూలల్లో పెట్టి ఉన్న పాత్రలు రక్తంతో నిండినట్లు నిండిపోతారు.

¶ అప్పుడు యెహోవా బయలు దేరతాడు. యుద్ధకాలంలో పోరాడే విధంగా ఆయన ఆ ఇతర దేశాల ప్రజలతో యుద్ధం చేస్తాడు.