TSK

TSK · యెషయా 32:9

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

Back to passage

¶ మీలో మృదువైన, అతి సుకుమారం కలిగిన స్త్రీ, సుకుమారంగా నేల మీద తన అరికాలు మోపలేని స్త్రీ కూడా తన కాళ్లమధ్యనుండి బయటకు వచ్చే పసికందును రహస్యంగా తింటుంది. వాటిలో కొంచెమైనా తనకిష్టమైన సొంత భర్తకూ తన కొడుకూ కూతురుకూ పెట్టదు.

సర్వ ప్రజలారా! ఈ సంగతి వినండి. ప్రపంచంలో నివసించే వాళ్ళంతా ధ్యాస పెట్టి వినండి.

కాబట్టి మనస్సు పెట్టి నేను చెప్పేది వినండి. జాగ్రత్తగా నా మాటలు ఆలకించండి.

సుందరసుకుమారి సీయోను కన్యను పూర్తిగా నాశనం చేస్తాను.

మోయాబు తన బాల్యం నుండీ సురక్షితంగానే ఉన్నట్టు భావించాడు. అతడు ఒక పాత్రనుండి మరో పాత్రకు పోయని ద్రాక్షరసంలా ఉన్నాడు. అలాగే అతడు ఎప్పుడూ చెరలోకి వెళ్ళలేదు. కాబట్టి అతని రుచి ఎప్పటిలా బాగానే ఉంది. సువాసన కూడా మారకుండా ఉంది.

¶ సీయోనులో హాయిగా సుఖపడే వారికి బాధ తప్పదు. సమరయ కొండల మీద దర్జాగా బతికే వారికి బాధ తప్పదు. ఇశ్రాయేలు వారికి సలహాదారులుగా ఉన్న గొప్ప రాజ్యాల్లోని ముఖ్య పెద్దలకు బాధ తప్పదు.

‹చెవులున్నవాడు విను గాక!”› అన్నాడు.