TSK

TSK · యెషయా 45:5

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

Back to passage

¶ కాబట్టి, పైన ఆకాశంలో, కింద భూమిపైనా యెహోవాయే దేవుడనీ, మరొక దేవుడు లేడనీ ఈరోజు గ్రహించండి.

¶ అప్పుడు లోకం లోని ప్రజలంతా యెహోవాయే దేవుడనీ, ఆయన తప్ప వేరే దేవుడు లేడనీ తెలుసుకుంటారు.

రాజుల అధికారాలను ఆయన రద్దు చేస్తాడు. వారి నడుములను సంకెళ్ళతో బంధిస్తాడు.

ఒక నడికట్టులాగా నాకు బలం ధరింపజేసేవాడు ఆయనే. నిరపరాధిని తన మార్గంలో నడిపించేవాడు ఆయనే.

యుద్ధానికి కట్టిన దట్టీలా నువ్వు నాకు బలం ధరింపజేశావు. నా మీదికి లేచిన వాళ్ళను నువ్వు నా కింద పడేశావు.

నీ చొక్కా అతనికి తొడిగిస్తాను. నీ నడికట్టును అతనికి కడతాను. నీ అధికారాన్ని అతనికి బదలాయిస్తాను. అతడు యెరూషలేములో నివాసం ఉన్న వాళ్ళకీ, యూదా జాతి వాళ్ళకీ ఒక తండ్రిగా ఉంటాడు.

నన్ను నమ్మి నేనే ఆయనను అని గ్రహించేలా మీరు, నేను ఎన్నుకున్న నా సేవకుడు నాకు సాక్షులు. నాకంటే ముందు ఏ దేవుడూ ఉనికిలో లేడు, నా తరవాత ఉండడు.

మీరు బెదరవద్దు, భయపడవద్దు. పూర్వకాలం నుండి నేను మీకు ఆ సంగతి వినిపిస్తూ ఉండలేదా? మీరే నాకు సాక్షులు, నేను తప్ప వేరొక దేవుడున్నాడా? నేను తప్ప వేరొక ఆశ్రయదుర్గం లేదు. ఉన్నట్టు నేనెరుగను.

నా సన్నిధిలోకి వచ్చి సంగతులు వివరించండి. ప్రజలు వారిలో వారిని సంప్రదించుకొనియండి. పూర్వకాలం నుండీ ఆ కార్యాలను ఎవరు తెలుపుతూ ఉన్నారు? చాలకాలం కిందటే దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవానైన నేనే గదా? నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను న్యాయవంతుడైన దేవుణ్ణి. నేనే రక్షించేవాణ్ణి. నేను తప్ప మరి ఏ దేవుడూ లేడు.

చాల కాలం క్రితం జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోండి. నేనే దేవుణ్ణి, మరి ఏ దేవుడూ లేడు. నేనే దేవుణ్ణి, నాలాంటి వాడు ఎవడూ లేడు.

¶ ప్రారంభంలో వాక్కు ఉన్నాడు. ఆ వాక్కు దేవుడి దగ్గర ఉన్నాడు. ఆ వాక్కు దేవుడే.