TSK

TSK · యోహాను 5:2

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

Back to passage

¶ ప్రధానయాజకుడు ఎల్యాషీబు, అతని సోదర యాజకులు పూనుకుని గొర్రెల ద్వారాన్ని కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలబెట్టారు. వాళ్ళు నూరవ గోపురం, హనన్యేలు గోపురం వరకూ ప్రతిష్టించారు. వాటికి సరిహద్దు గోడలు కట్టి ప్రతిష్ఠించారు.

ఆ గుంపు వాళ్ళు ఎఫ్రాయీం ద్వారం మీదగా వెళ్లి, పాత ద్వారాన్ని, మత్స్యపు ద్వారాన్ని, హనన్యేలు గోపురాన్ని, మేయా గోపురాన్ని దాటి వెళ్ళి, గొర్రెల ద్వారం వరకూ ఎక్కి బందీ గృహం ద్వారం దగ్గర నిలిచారు.

పాత కోనేటి నీళ్ళ కోసం రెండు గోడల మధ్య మీరు ఒక జలాశయాన్ని నిర్మించారు. కానీ పట్టణాన్ని నిర్మించిన వాణ్ణి మీరు పట్టించుకోలేదు. ఏనాడో దాని కోసం ఆలోచించిన వాణ్ణి మీరు లక్ష్యం చేయలేదు.

తన సిలువ తానే మోసుకుంటూ బయటకు వచ్చి, ‘కపాల స్థలం’ అనే ప్రాంతానికి వచ్చాడు. హెబ్రీ భాషలో ఆ స్థలానికి ‘గొల్గొతా’ అని పేరు.

¶ అప్పుడు యేసు ఆమెను చూసి, ‹“మరియా”› అని పిలిచాడు. ఆమె ఆయన వైపుకు తిరిగి, “రబ్బూనీ” అని పిలిచింది. రబ్బూనీ అనే మాటకు హీబ్రూ భాషలో ఉపదేశకుడు అని అర్థం.