TSK

TSK · మార్కు 14:72

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

Back to passage

¶ జనసంఖ్య చూసినందుకు దావీదు మనస్సు నొచ్చుకుంది. అతడు యెహోవాతో “నేను చేసిన పని వలన గొప్ప పాపం మూటగట్టుకున్నాను. ఇలా చేయడం చాలా పెద్ద పాపం. యెహోవా, నేను చాలా తెలివి తక్కువ పని చేశాను. దయచేసి నీ దాసుడి దోషం తీసివెయ్యి” అన్నాడు.

“నేను కచ్చితంగా ఎఫ్రాయిము దుఃఖించడం విన్నాను, ‘నువ్వు నన్ను శిక్షించావు, నేను శిక్షకు లోనయ్యాను. కాడి మోసే శిక్షణలేని దూడలా ఉన్న నన్ను మళ్ళీ తీసుకురా, అప్పుడు నేను వస్తాను. నువ్వు నా దేవుడవైన యెహోవావు.

నువ్వు చేసిన వాటన్నిటి కోసం నేను ప్రాయశ్చిత్తం చేసినప్పుడు దాన్ని గుర్తు చేసుకుని సిగ్గుపడి, నోరు మూసుకుంటావు.” ఇదే ప్రభువైన యెహోవా ప్రకటన.

యేసు అతణ్ణి చూసి, ‹“నేను నీతో కచ్చితంగా చెప్పేదేమంటే, ఈ రాత్రి కోడి కూసే ముందే నేనెవరో తెలియదని నీవు మూడుసార్లు చెబుతావు”› అన్నాడు.

అప్పుడు యేసు, ‹“నీతో కచ్చితంగా చెప్పేదేమిటంటే ఈ రాత్రి కోడి రెండు సార్లు కూయక ముందే నీవు మూడు సార్లు నేనెవరో తెలియదని అబద్ధం ఆడతావు”› అని అతనితో అన్నాడు.

¶ ‹అతనికి బుద్ధి వచ్చింది. అతడిలా అనుకున్నాడు, ‘నా తండ్రి దగ్గర ఎంతోమంది కూలి వాళ్ళకు ఆహారం పుష్కలంగా ఉంది. నేనేమో ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను.›

దాంతో పేతురు బయటకు వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చాడు.