TSK

TSK · 1 దిన 22:11

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

అయితే నా తండ్రి నీకు కీడు చేయాలని ఉద్దేశిస్తున్నాడని నాకు తెలిస్తే అది నీకు తెలియజేసి నీవు క్షేమంగా వెళ్ళేలా నిన్ను పంపించకపోతే యెహోవా నాకు గొప్ప కీడు కలుగచేస్తాడు గాక. యెహోవా నా తండ్రికి తోడుగా ఉండినట్లు నీకూ తోడుగా ఉంటాడు గాక.

¶ ఇంకా దావీదు తన కొడుకు సొలొమోనుతో “నువ్వు బలం పొంది ధైర్యం తెచ్చుకుని ఈ పనికి పూనుకో. భయపడొద్దు, కంగారు పడొద్దు. నా దేవుడైన యెహోవా నీతో ఉంటాడు. యెహోవా మందిర సేవను గూర్చిన పనంతా నువ్వు ముగించే వరకూ ఆయన నిన్ను ఎంతమాత్రం విడిచిపెట్టడు.

¶ యెహోవా అప్పుడు చెప్పిన తన మాటను ఇప్పుడు నెరవేర్చాడు. యెహోవా సెలవు ప్రకారం నేను నా తండ్రి దావీదు స్థానంలో రాజునై సింహాసనం మీద కూర్చుని ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాకు మందిరం కట్టించాను.