TSK

TSK · 1 దిన 6:50

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

¶ అహరోను అమ్మీనాదాబు కూతురు, నయస్సోను సహోదరి అయిన ఎలీషెబను పెళ్లి చేసుకున్నాడు. వారికి నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు పుట్టారు.

¶ అప్పుడు మోషే పాపం కోసం బలి కావాల్సిన మేకను గూర్చి అడిగాడు. కానీ అది అప్పటికే దహనమైపోయిందని తెలుసుకున్నాడు. కాబట్టి అతడు తక్కిన అహరోను కొడుకులు ఎలియాజరు, ఈతామారులపై కోప్పడ్డాడు.

లేవీయులను నడిపించే వారందరికీ యాజకుడైన అహరోను కొడుకు ఎలియాజరు నాయకత్వం వహించాలి. అతడు పరిశుద్ధస్థలం బాధ్యత తీసుకున్న వారిని పర్యవేక్షించాలి.

¶ యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు అతడు చేశాడు. అతడు యెహోషువను తీసుకుని యాజకుడైన ఎలియాజరు ఎదుట, సమాజమంతటి ఎదుట అతన్ని నిలబెట్టి,

¶ గతంలో ఎలియాజరు కొడుకైన ఫీనెహాసు వాళ్ళపై అధికారిగా ఉన్నాడు. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు.

¶ ఈ విషయాలన్నీ జరిగిన తరువాత పర్షియా దేశపు రాజు అర్తహషస్త పాలనలో ఎజ్రా బబులోను నుండి యెరూషలేము పట్టణానికి వచ్చాడు. ఇతడు శెరాయా కొడుకు. శెరాయా అజర్యా కొడుకు, అజర్యా హిల్కీయా కొడుకు.

నాలుగో రోజు వెండి బంగారు పాత్రలను మన దేవుని మందిరంలో యాజకుడైన ఊరియా కొడుకు మెరేమోతు కాటా వేశాడు. అతనితో పాటు ఫీనెహాసు కొడుకు ఎలియాజరు, లేవీ గోత్రికుడైన యేషూవ కొడుకు యోజాబాదు, బిన్నూయి కొడుకు నోవద్యా కూడా అక్కడ ఉన్నారు.