TSK

TSK · 1 సమూ 3:17

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

అతడు బాలాకు దగ్గరికి వెళ్లినప్పుడు అతడు తన దహనబలి దగ్గర నిలిచి ఉన్నాడు. మోయాబు నాయకులు కూడా అతని దగ్గర ఉన్నారు. బాలాకు “యెహోవా ఏం చెప్పాడు?” అని అడిగాడు.

అప్పుడు సౌలు “యోనాతానూ, నీవు తప్పకుండా చనిపోవాలి. అందుకు నేను ఒప్పుకోకపోతే దేవుడు నాకు గొప్ప కీడు కలిగిస్తాడు” అన్నాడు.

అనుకుని “అతనికి చెందిన వారిలో ఒక మగపిల్లవాడి నైనా తెల్లవారే సరికి ఉండయ్యను. లేదా దేవుడు మరి గొప్ప అపాయం దావీదు శత్రువులకు కలుగజేయుగాక” అని శపథం చేశాడు.

¶ ఇంకా రాత్రి కాకముందు ప్రజలు దావీదు దగ్గరికి వచ్చి ఏమైనా తినమని అతణ్ణి బతిమిలాడారు. దావీదు “సూర్యుడు అస్తమించక ముందు నేను ఏదైనా ఆహారం తీసుకొంటే దేవుడు నాకు ఎంతో కీడు కలిగిస్తాడుగాక” అని ఒట్టు పెట్టుకున్నాడు.

¶ తరువాత అమాశా దగ్గరికి మనుషులను పంపి “నువ్వు నా రక్త సంబంధివి, సోదరుడివి కాదా? యోవాబుకు బదులు నిన్ను సైన్యాధిపతిగా ఖాయం చేయకపోతే దేవుడు నాకు గొప్ప కీడు కలుగజేస్తాడు గాక” అని చెప్పమన్నాడు.

అప్పుడు రాజు “ఈ రోజు షాపాతు కొడుకు ఎలీషా మెడపై తల నిలిచి ఉంటే దేవుడు నన్ను పెద్ద ప్రమాదంలో పడవేస్తాడు గాక” అన్నాడు.

¶ తరువాత రాజైన సిద్కియా యెహోవా మందిరంలో ఉన్న మూడో ద్వారంలోకి ప్రవక్త అయిన యిర్మీయాను పిలిపించి, అతనితో “నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. నా నుంచి ఏదీ దాచకుండా చెప్పు,” అన్నాడు.

“యాకోబు వంశమా! యెహోవా సహనం తగ్గిపోయిందా? ఆయన ఇలాంటి పనులు చేస్తాడా?” అని చెప్పడం భావ్యమేనా? యథార్థంగా ప్రవర్తించేవారికి నా మాటలు క్షేమం కలిగిస్తాయి గదా!