TSK

TSK · 2 దిన 12:9

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

సొలొమోను రాజు బంగారాన్ని సుత్తెలతో రేకులుగా సాగగొట్టించి దానితో 200 పెద్ద డాళ్ళు చేయించాడు. ఒక్కొక్క డాలు మూడున్నర కిలోల బంగారంతో చేశారు.

కాబట్టి ఆసా యెహోవా మందిరపు ఖజానాలోనూ రాజభవనపు ఖజానాలోనూ మిగిలిన వెండి బంగారమంతా తీసి తన సేవకులకు ఇచ్చి, దమస్కులో నివసిస్తున్న సిరియా రాజు బెన్హదదుకు పంపించాడు. బెన్హదదు హెజ్యోనుకు పుట్టిన టబ్రిమ్మోను కొడుకు. ఆసా ఇలా మనవి చేశాడు.

కాబట్టి హిజ్కియా యెహోవా మందిరంలో, రాజనగరంలో, వస్తువుల రూపంలో ఉన్న వెండి అంతా అతనికి ఇచ్చేశాడు.

¶ దాని శ్రేష్ఠమైన వస్తువులన్నీ శత్రువుల చేతికి చిక్కాయి. దాని సమాజ ప్రాంగణంలో ప్రవేశించకూడదని ఎవరి గురించి ఆజ్ఞాపించావో ఆ ప్రజలు దాని పవిత్ర ప్రాంగణంలో ప్రవేశించడం అది చూస్తూ ఉంది.