TSK

TSK · 2 రాజులు 22:13

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

¶ ఒకవేళ మీరు నా మాట వినకుండా నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించకుండా

¶ “ఈ ధర్మశాస్త్రానికి సంబంధించిన విధులను పాటించకుండా వాటిని లక్ష్యపెట్టనివాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్‌” అనాలి.

¶ అప్పుడు వారిమీద నా కోపం రేగుతుంది. నేను వాళ్ళని వదిలిపెడతాను. వారికి నా ముఖం చాటు చేస్తాను. వాళ్ళు నాశనమైపోతారు. ఎన్నో విపత్తులూ కష్టాలూ వాళ్లకు సంభవిస్తాయి. ఆ సమయంలో వాళ్ళు, మన దేవుడు మన మధ్య లేనందువల్లనే మనకు ఈ విపత్తులు వచ్చాయి గదా! అనుకుంటారు.

¶ కానీ యెహోషాపాతు “మన కోసం యెహోవాను సంప్రదించడానికి ఇక్కడ ఒక్క యెహోవా ప్రవక్త కూడా లేడా?” అని అడిగాడు. అప్పుడు ఇశ్రాయేలు రాజు దగ్గర సైనికోద్యోగి ఒకడు “షాపాతు కొడుకు ఎలీషా ఇక్కడ ఉన్నాడు. అతడు ఇంతకు ముందు ఎలీయా చేతులపై నీళ్ళు పోసే వాడు” అని చెప్పాడు.

¶ సౌలు యెహోవాకు విరోధంగా ద్రోహం చేసాడు కాబట్టి ఈ విధంగా చనిపోయాడు. అతడు యెహోవా ఆజ్ఞలు పాటించలేదు. ఆత్మలతో సంభాషించే మనిషి దగ్గరికి సలహా కోసం వెళ్ళాడు.

“మీరు వెళ్లి దొరకిన ఈ గ్రంథంలోని మాటల గురించి నాకోసం ఇశ్రాయేలు యూదాలో మిగిలిన వారి కోసం యెహోవా చిత్తాన్ని అడగండి. మన పూర్వీకులు ఈ గ్రంథంలో రాసిన మాటలను పట్టించుకోలేదు, దానిలో రాసిన వాటన్నిటి ప్రకారం చేయలేదు కాబట్టి యెహోవా మనమీద తన కోపాన్ని చాలా ఎక్కువగా కుమ్మరించాడు.”

వారు ఒక పూటంతా అక్కడే నిలబడి దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథం చదివించుకున్నారు. మరో పూట తమ పాపాలు ఒప్పుకొంటూ దేవుడైన యెహోవాకు స్తుతులు చెల్లిస్తూ వచ్చారు.

నీకు, నీకు మాత్రమే భయపడాలి. నువ్వు కోపపడితే నీ ఎదుట ఎవరు నిలుస్తారు?

మా పితరుల్లాగానే మేము పాపం చేశాము. దోషాలు మూటగట్టుకుని భక్తిహీనులమైపోయాము.

వినండి. మీరంతా నా మాట వినకుండా మీ చెడ్డ హృదయ కాఠిన్యం ప్రకారం నడుచుకుంటున్నారు. మీరు మీ పూర్వీకుల కంటే మరి ఎక్కువ దుర్మార్గం చేశారు.

¶ “బబులోను రాజు నెబుకద్నెజరు మన మీద యుద్ధం చేస్తున్నాడు. అతడు మనలను విడిచి వెళ్లిపోయేలా యెహోవా తన అద్భుత క్రియలన్నిటిని మన పట్ల జరిగిస్తాడేమో దయచేసి మా కోసం యెహోవా దగ్గర విచారణ చేయండి” అని చెప్పడానికి యిర్మీయా దగ్గరికి వారిని పంపించాడు. అప్పుడు యెహోవా దగ్గరనుంచి యిర్మీయాకు వచ్చిన సందేశం.

తరువాత రాజైన సిద్కియా అతన్ని రప్పించడానికి ఒకణ్ణి పంపి, అతన్ని తన ఇంటికి పిలిపించి “యెహోవా దగ్గర నుంచి ఏ మాటైనా వచ్చిందా?” అని ఏకాంతంగా అతన్ని అడిగాడు. యిర్మీయా “వచ్చింది, నిన్ను బబులోను రాజు చేతికి అప్పగించడం జరుగుతుంది” అన్నాడు.

¶ మా పితరులు పాపం చేసి చనిపోయారు. మేము వాళ్ళ పాపానికి శిక్ష అనుభవిస్తున్నాం.

¶ బబులోను చెరలో ఉన్న కాలంలో, ఏడో సంవత్సరం, ఐదో నెల, పదో రోజు ఇశ్రాయేలీయుల పెద్దల్లో కొంతమంది యెహోవాను యోచన అడగాలని ఆయన దగ్గరికి వచ్చి నా ఎదుట కూర్చున్నారు.

¶ ఆయన తన సేవకులైన ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి, వాటిని అనుసరించి నడుచుకోవాలని చెప్పాడు. కానీ మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు.

ఆయన తీవ్రమైన కోపాన్ని తట్టుకోగలిగేవాడు ఎవడు? ఆయన ఉగ్రత ఎదుట ఎవ్వరూ నిలబడలేరు. ఆయన కోపం అగ్ని ప్రవాహంలాగా పారుతుంది. ఆయన కొండలను బద్దలయ్యేలా చేస్తాడు.

ఎందుకంటే ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టిస్తుంది. ధర్మశాస్త్రం లేని చోట దాన్ని అతిక్రమించడం కూడా ఉండదు.

¶ వాక్కు ప్రకారం నడుచుకునే వారుగా ఉండండి. వాక్కు వినేవారిగా మాత్రమే ఉంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే.