TSK

TSK · 2 సమూ 14:22

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

నా పట్ల, నీ ప్రజల పట్ల నువ్వు దయ చూపిస్తున్నావని మాకు దేని వల్ల తెలుస్తుంది? నువ్వు మాతో కలసి రావడం వల్లనే కదా. ఆ విధంగా మేము, అంటే నేను, నీ ప్రజలు భూమి మీద ఉన్న ప్రజల్లో నుండి ప్రత్యేకంగా గుర్తింపు పొందుతాం” అని ఆయనతో అన్నాడు.

దావీదు “నేను నీకు అనుకూలంగా ఉన్న విషయం మీ తండ్రికి బాగా తెలుసు కాబట్టి నీకు బాధ కలిగించడం ఇష్టంలేక నీకు చెప్పడం లేదు. యెహోవా మీద ఒట్టు, నీ మీద ఒట్టు, నిజంగా నాకూ, మరణానికి ఒక్క అడుగు దూరం మాత్రమే ఉంది” అని ప్రమాణపూర్తిగా చెప్పాడు.

అప్పుడు రాజు, ప్రజలందరూ నది అవతలకు వచ్చారు. రాజు బర్జిల్లయిని ముద్దు పెట్టుకుని దీవించాడు. తరువాత బర్జిల్లయి తన స్వస్థలానికి వెళ్ళిపోయాడు.

నా సంగతి విన్న ప్రతివాడూ నన్ను అదృష్టవంతుడిగా ఎంచాడు. నేను కంటబడిన ప్రతివాడూ నన్ను గూర్చి సాక్ష్యమిచ్చాడు.

¶ ఆమె కొడుకులు ఆమెను ధన్య అంటారు. ఆమె పెనిమిటి ఆమెను పొగడుతాడు.