TSK

TSK · 2 సమూ 16:10

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

మీరు నాకు కీడు చేయాలని చూశారు గానీ మీరిప్పుడు చూస్తున్నట్టు, అనేకమందిని బతికించేలా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు.

పట్టాభిషేకం అయిన నేను ఈ రోజు బలం లేనివాడినయ్యాను. సెరూయా కొడులైన ఈ వ్యక్తులు నాకంటే బలమైనవారు. వారు చేసిన దుష్టకార్యాలను బట్టి వారు కీడు చేసిన ప్రకారం యెహోవా వారికి ప్రతీకారం చేస్తాడు గాక.”

“నీకు మరణశిక్ష విధించను” అని షిమీకి వాగ్దానం చేశాడు.

¶ అప్పుడు ఒక ఆత్మ ముందుకు వచ్చి యెహోవా ఎదుట నిలబడి ‘నేనతన్ని ప్రేరేపిస్తాను’ అన్నాడు. యెహోవా, ‘ఎలా’ అని అతన్ని అడిగాడు.

ఆయన తీసుకువెళ్తుంటే ఆయనను అడ్డగించేవాడెవడు? “నువ్వేం చేస్తున్నావు?” అని ఆయనను అడగగలిగే వాళ్ళు ఎవరు?

¶ భూలోకంలోని ప్రజలంతా ఆయన దృష్టిలో శూన్యులు. ఆయన పరలోకంలోని సైన్యాల మీదా, భూలోకంలోని ప్రజల మీదా తన ఇష్టం వచ్చినట్టు జరిగించేవాడు. ఆయన చెయ్యి పట్టుకుని “నువ్వు చేస్తున్నదేమిటి?” అని అడిగే అధికారం ఎవ్వరికీ లేదు.

శిష్యులైన యాకోబు యోహానులు అది చూసి, “ప్రభూ, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయాలని మేము వీరిని శపించడం నీకిష్టమేనా?” అని అడిగారు.

అది సరే గానీ, ఓ మనిషీ, దేవుణ్ణి ఎదురు ప్రశ్నించడానికి నీ వెవరివి? నన్నెందుకిలా చేశావు అని తయారైనది తనను తయారు చేసిన వానితో చెప్పగలదా?