TSK

TSK · 2 సమూ 23:18

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

సెరూయా ముగ్గురు కొడుకులు యోవాబు, అబీషై, అశాహేలు అక్కడ ఉన్నారు. అశాహేలు అడవి లేడి లాగా వేగంగా పరిగెత్తగలడు.

మిగిలినవారిని అమ్మోనీయులను ఎదుర్కోడానికి తన సోదరుడు అబీషైకి అప్పగించాడు.

ఒక భాగానికి యోవాబుకు, ఒక భాగాన్ని సెరూయా కుమారుడు, యోవాబు సోదరుడు అబీషైకు, మరో భాగాన్ని గిత్తీయుడు ఇత్తయికు నాయకత్వ బాధ్యతలు అప్పగించాడు. తరువాత దావీదు “నేను మీతోకూడా కలసి బయలుదేరుతున్నాను” అని వారితో చెప్పాడు.

¶ వీళ్ళకు ఇద్దరు అక్కచెల్లెళ్ళు. వాళ్ళు సెరూయా అబీగయీలు. సెరూయాకు అబీషై, యోవాబు, అశాహేలు అనే ముగ్గురు కొడుకులు పుట్టారు.

ఒంటరిగా ఉన్నవాణ్ణి పడదోయడం తేలిక. అయితే ఇద్దరు కలిసి ఉంటే తమపై దాడిని ఎదుర్కోగలరు. మూడు పేటల తాడు త్వరగా తెగిపోదు గదా?