యెహోవా యెహోషువకు తోడై ఉండడం వలన అతని కీర్తి ఆ కనాను దేశమంతటా వ్యాపించింది.
TSK
TSK · 2 సమూ 7:9
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
దావీదుకు యెహోవా తోడుగా ఉండడంవల్ల అన్ని విషయాల్లో తెలివితేటలతో ప్రవర్తిస్తూ వచ్చాడు.
¶ ఈ విధంగా సౌలు, అతని ముగ్గురు కొడుకులు, సౌలు ఆయుధాలు మోసేవాడు, సౌలు మనుషులంతా ఒకే రోజున చనిపోయారు.
దమస్కుకు చెందిన ఆరాము దేశంలో తన సైనిక దళాన్ని ఉంచాడు. అరామీయులు దావీదుకు సామంతులై కప్పం చెల్లిస్తూ వచ్చారు. దావీదు ఏ యుద్ధానికి వెళ్ళినా యెహోవా అతణ్ణి కాపాడుతూ ఉన్నాడు.
¶ యెహోవా తనను సౌలు బారి నుండి, తన శత్రువులందరి నుండి తప్పించిన రోజున దావీదు యెహోవాకు ఈ పాట పాడాడు. అతడిలా ప్రార్థించాడు.
ఆయన నా కాళ్లు జింకకాళ్లవలె చేస్తాడు. పర్వతాలపై నన్ను నిలుపుతాడు.
నేను నేల దుమ్ము లాగా వారిని పొడి చేస్తాను. వీధిలోని బురదలాగా నేను వారిని వెదజల్లి అణగదొక్కుతాను.
నా శత్రువులను తరిమి పట్టుకున్నాను. వాళ్ళు నాశనం అయ్యేవరకు నేను వెనుతిరగలేదు.
దేవుని పట్టణమా, నీ గురించి చాలా గొప్ప విషయాలు చెప్పుకున్నారు. సెలా
ఆయన దుమ్ములోనుండి దరిద్రులను లేవనెత్తుతాడు. బూడిద కుప్ప మీద నుండి పేదలను పైకెత్తుతాడు.