TSK

TSK · అపొస్తలుల కార్యములు 20:16

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

¶ వారు ఎఫెసు వచ్చినప్పుడు పౌలు వారిని అక్కడ విడిచి పెట్టి తాను మాత్రం సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో వాదిస్తూ ఉన్నాడు.

¶ పౌలు ఎఫెసులో పరిచర్య ముగించిన తరువాత మాసిదోనియ, అకయ దేశాల మార్గంలో యెరూషలేము వెళ్ళాలని ఆత్మలో ఉద్దేశించి ‘నేను అక్కడికి వెళ్ళిన తరువాత రోమ్ నగరాన్ని కూడా చూడాలి’ అని నిర్ణయించుకున్నాడు.

¶ మేము ఓడ ఎక్కి అస్సు అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ పౌలుని ఎక్కించుకోవాలని ముందుగా బయల్దేరాం. తాను అక్కడివరకూ కాలి నడకను రావాలని ఉద్దేశించి పౌలు మమ్మల్ని ఆ విధంగా ఆదేశించాడు.

¶ మేమక్కడి శిష్యులను కలుసుకుని అక్కడ ఏడు రోజులు ఉన్నాం. వారు ఆత్మ ద్వారా “నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దు” అని పౌలుతో చెప్పారు.

కాబట్టి నేను స్పెయిను దేశానికి ప్రయాణించినప్పుడు దారిలో ముందు మిమ్మల్ని చూసి, మీ సహవాసంలో కొద్ది సమయం ఆనందించిన తరువాత, మీరు నన్ను అక్కడికి సాగనంపుతారని ఎదురు చూస్తున్నాను.