అందుకు యెజెబెలు “నీవు ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలన చేయడం లేదా? లేచి భోజనం చెయ్యి. మనస్సులో సంతోషంగా ఉండు. నేనే యెజ్రెయేలు వాడైన నాబోతు ద్రాక్షతోట నీకిప్పిస్తాను” అంది.
TSK
TSK · ఆమోసు 6:12
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
నువ్వు మూర్ఖుడవనీ నీ మెడ నరాలు ఇనుములాంటివనీ నీ నొసలు కంచులాంటిదనీ నాకు తెలుసు.
యెహోవా, యథార్థత చూడాలని కదా నీ కోరిక? నువ్వు వారిని కొట్టావు కానీ వారు లెక్క చేయలేదు. వారిని క్షీణింప జేశావు గానీ వారు శిక్షను అంగీకరించలేదు. రాతికంటే తమ ముఖాలు కఠినం చేసుకుని నీ వైపు తిరగడానికి ఒప్పుకోలేదు.
¶ వారు శుష్కప్రియాలు వల్లిస్తారు. అబద్ధ ప్రమాణాలతో ఒప్పందాలు చేస్తారు. అందువలన నాగటి చాళ్లలో విషపు మొక్కలాగా దేశంలో వారి తీర్పులు మొలుస్తున్నాయి.
వాళ్ళు న్యాయాన్ని భ్రష్టం చేసి, నీతిని నేలపాలు చేస్తున్నారు.
¶ వాళ్ళ రెండు చేతులూ కీడు చేయడానికి ఆరితేరాయి. అధికారి డబ్బులు అడుగుతాడు. న్యాయమూర్తి లంచాలకు సిద్ధంగా ఉంటాడు. గొప్పవాడు తనకు కావాలిసిన దాన్ని తెమ్మని చెబుతున్నాడు. ఆవిధంగా వాళ్ళు, కలిసి కపట ఉపాయాలు పన్నుతారు.
¶ అయితే వారు మూర్ఖులై వినకుండా చెవులు మూసుకున్నారు.