TSK

TSK · దానియేలు 3:1

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

¶ అప్పుడు అహరోను “మీ భార్యల, కొడుకుల, కూతుళ్ళ చెవులకు ఉన్న బంగారు పోగులు తీసి నా దగ్గరికి తీసుకు రండి” అని చెప్పాడు.

వారి దేవతా ప్రతిమలను మీరు అగ్నితో కాల్చివేయాలి. వాటి మీద ఉన్న వెండి బంగారాల మీద ఆశ పెట్టుకోకూడదు. మీరు దాని ఉచ్చులో పడతారేమో. అందుకే వాటిని మీరు తీసుకోకూడదు. ఎందుకంటే అది మీ యెహోవా దేవునికి అసహ్యం.

యరొబాము తన హృదయంలో ఇలా ఆలోచన చేసి రెండు బంగారు దూడలు చేయించాడు. అతడు ప్రజలను పిలిచి “యెరూషలేము వెళ్ళడం మీకు చాలా కష్టం.

¶ ఇండియా నుండి ఇతియోపియా వరకూ గల 127 సంస్థానాలను పరిపాలించిన అహష్వేరోషు కాలంలో జరిగిన విషయాలు ఇవి.

ఇతర ప్రజల దేవుళ్ళు మనుషులు తమ చేతులతో తయారు చేసిన వెండి, బంగారం విగ్రహాలు.

వెండితో పోత పోసిన చెక్కిన బొమ్మలనూ, బంగారంతో పోత పోసిన విగ్రహాలనూ మీరు అపవిత్రం చేస్తారు. అసహ్యమైన గుడ్డగా వాటిని భావిస్తారు. “ఇక్కడ నుండి పో” అని వాటికి చెప్తారు.

ప్రజలు విస్తారమైన బంగారం తెచ్చి పోస్తారు. వెండిని తెచ్చి బరువు తూస్తారు. ఒక కంసాలిని జీతానికి పిలిచి అతనికి దాన్ని అప్పగిస్తారు. అతడు దాన్ని ఒక దేవుడుగా రూపొందిస్తాడు. వారు దానికి సాగిలపడి నమస్కారం చేస్తారు.

మనుషులు తమకు దేవుళ్ళను కల్పించుకుంటారా? అయినా వారు దేవుళ్ళు కారు.

రాజు దానియేలుకు ఎన్నో విలువైన బహుమతులు ఇచ్చాడు. అతణ్ణి ఘనపరచి బబులోను ఆస్థానం అంతటిపైన అధికారిగా, దేశాలోని జ్ఞానులందరి మీద పెద్దగా నియమించాడు.

¶ అప్పటి నుండి రాజు షద్రకు, మేషాకు, అబేద్నెగోలను బబులోను సంస్థానంలో ఉన్నత స్థానాల్లో అధికారులుగా నియమించాడు.

¶ వారు రాజులను నియమించుకున్నారు. కానీ నేను వారిని నియమించలేదు. వారు అధికారులను పెట్టుకున్నారు. కానీ వారెవరూ నాకు తెలియదు. తమ వెండి బంగారాలతో తమ కోసం విగ్రహాలు చేసుకున్నారు. కానీ అదంతా వారు నాశనమై పోవడానికే.

¶ కాబట్టి మనం దేవుని సంతానం గదా, దేవత్వం అనేది మనుషులు తమ ఆలోచనా నైపుణ్యాలతో చెక్కిన బంగారు, వెండి, రాతి బొమ్మలను పోలి ఉంటుందని అనుకోకూడదు.

¶ ఈ కీడుల చేత చావకుండా మిగిలిన మానవాళి పశ్చాత్తాపపడలేదు. వారు దయ్యాలను పూజించడం, తమ చేతులతో చేసిన చూడటానికీ, వినడానికీ, నడవడానికీ శక్తి లేని బంగారంతో, వెండితో, కంచుతో, రాయితో, కర్రతో చేసిన విగ్రహాలను పూజించడం మానలేదు.