TSK

TSK · దానియేలు 5:6

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

వాళ్ళు దరిద్రులపై దాడులు చేసి విడిచిపెట్టినవాళ్ళు. తమవి కాని ఇళ్ళను బలవంతంగా ఆక్రమించుకుంటారు. ఆ ఇళ్ళను కట్టి పూర్తి చేయరు.

నువ్వు వారిని కాలుజారే స్థలంలో ఉంచావు. నువ్వు వారిని పడదోసినప్పుడు వారు నశిస్తారు.

అందువలన చేతులన్నీ బలహీనమై వేలాడతాయి, ప్రతివాడి గుండె కరిగిపోతుంది.

బలహీనమైన చేతులను బలపరచండి. వణుకుతున్న మోకాళ్లను దృఢపరచండి.

¶ వాళ్ళందరి చేతులూ తడబడతాయి. మోకాళ్ళు నీళ్ళలా బలహీనం అవుతాయి.

¶ రాజైన నెబుకద్నెజరు పాలన కాలం రెండవ సంవత్సరంలో అతనికి నిద్రలో కలలు వచ్చాయి. ఆ కలలను బట్టి అతడు కలవరం చెందాడు. అతనికి నిద్రపట్టడం లేదు.

ఆ కల వల్ల మంచం మీద పండుకుని ఉన్న నా మనస్సులో పుట్టిన ఆలోచనలు నన్ను కలవరపెట్టాయి.

¶ అందువల్ల బెల్షస్సరు రాజు మరింత భయపడ్డాడు. అధికారులంతా ఆశ్చర్యపడేలా అతని ముఖం వికారంగా మారిపోయింది.

అది ఏమీ లేకుండా ఖాళీగా, పాడుబడిపోతుంది. ప్రజల గుండెలు నీరైపోతున్నాయి. వాళ్ళ మోకాళ్లు వణకుతున్నాయి, అందరిలో వేదన ఉంది. అందరి ముఖాలు తెల్లబోతున్నాయి.