TSK

TSK · ద్వితీ 16:1

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

¶ మీరు దాన్ని తినవలసిన విధానం ఇది. మీ నడుముకు నడికట్టు కట్టుకుని, కాళ్ళకు చెప్పులు వేసుకుని, మీ కర్రలు చేతబట్టుకుని త్వరత్వరగా తినాలి. ఎందుకంటే అది యెహోవాకు పస్కా బలి.

ఆ 430 సంవత్సరాలు ముగిసిన రోజునే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశం నుండి తరలి వెళ్లాయి.

¶ అప్పుడు మోషే ప్రజలను సమకూర్చి ఇలా చెప్పాడు. “మీరు ఐగుప్తులో బానిసత్వం నుండి విడుదల పొంది బయటకు వచ్చిన ఈ రోజును జ్ఞాపకం చేసుకోండి. యెహోవా తన బలమైన చేతులు చాపి ఆ దాస్యం నుండి మిమ్మల్ని విడిపించాడు. మీరు పొంగ జేసే పిండితో చేసిన రొట్టెలు తినకూడదు.

¶ సంవత్సరంలో మూడుసార్లు నాకు ఉత్సవం జరిగించాలి.

¶ పొంగజేసే పిండి లేని రొట్టెల పండగ ఆచరించాలి. నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారం ఐగుప్తునుండి మీరు బయలుదేరి వచ్చిన ఆబీబు నెలలో నియమించిన సమయంలో ఏడు రోజులపాటు పొంగజేసే పిండి లేని రొట్టెలు తినాలి. మీరు అబీబు నెలలో ఐగుప్టులో నుండి బయలుదేరి వచ్చారు గదా.

“ప్రతి సంవత్సరం ఇశ్రాయేలు ప్రజలు పస్కా పండగను దానికి నిర్ధారించిన తేదీల్లో ఆచరించాలి.