TSK

TSK · ద్వితీ 2:32

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

కాని, సీహోను ఇశ్రాయేలీయులను తన సరిహద్దుల గుండా వెళ్ళనివ్వ లేదు. ఇంకా సీహోను తన జనమంతా సమకూర్చుకుని ఇశ్రాయేలీయుల మీద దాడి చెయ్యడానికి ఎడారిలోకి వెళ్లి, యాహజుకు వచ్చి ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశాడు.

¶ ఇశ్రాయేలీయులు యొర్దానుకు తూర్పుగా అవతల ఉన్న అర్నోను లోయ నుండి హెర్మోను కొండ వరకూ తూర్పు మైదానమంతటిలో ఉన్న వారిని ఓడించి వారి దేశాలను ఆక్రమించుకొన్న రాజులు ఎవరంటే,

¶ అంతేకాక, రాజ్యాలను, అన్య దేశ ప్రజలను వారికి లోబరచి, వేరే ప్రదేశాలు వారి స్వాధీనంలోకి వచ్చేలా చేశావు. వారు హెష్బోను రాజు సీహోను దేశాన్నీ, బాషాను రాజు ఓగు దేశాన్నీ ఆక్రమించుకున్నారు.

అమోరీయుల రాజు సీహోనును, బాషాను రాజు ఓగును కనాను రాజ్యాలన్నిటినీ నేలమట్టం చేశాడు.