TSK

TSK · ద్వితీ 24:1

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

ఆ కొడుకు మరొకామెను చేసుకున్నా మొదటి ఆమెకు తిండి, బట్ట, సంసార ధర్మం విషయంలో ఏమీ తక్కువ చేయకూడదు.

¶ ఒకడు స్త్రీని పెళ్లి చేసుకుని ఆమెతో శారీరకంగా ఏకమైన తరువాత ఆమెను అనుమానించి

ఆమెతో శారీరకంగా కలిసినవాడు ఆ కన్య తండ్రికి 50 వెండి నాణాలు చెల్లించి ఆమెను పెళ్లి చేసుకోవాలి. అతడు ఆమెను ఆవమానపరచాడు కాబట్టి అతడు జీవించినంత కాలం ఆమెను విడిచి పెట్టకూడదు.

యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. “నేను మీ తల్లిని విడిచిపెట్టి ఇచ్చిన విడాకుల పత్రం ఏదీ? నా అప్పులవాళ్ళలో మిమ్మల్ని ఎవరికి అమ్మివేశాను? కేవలం మీ దోషాలను బట్టే మీరు అమ్ముడుపోయారు. మీ తిరుగుబాటును బట్టే మీ తల్లికి విడాకులు ఇవ్వడం జరిగింది.

ఇశ్రాయేలు వ్యభిచారం చేసినందుకే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు విడాకులిచ్చి పంపేశాను. విశ్వాసఘాతకురాలైన ఆమె సోదరి యూదా దాన్ని చూసి ఆమె కూడా భయం లేకుండా వ్యభిచారం చేస్తూ ఉంది.

ఆమె భర్త యోసేపు నీతిపరుడు. అందువల్ల అతడు ఆమెను బహిరంగంగా అవమానపరచకుండా రహస్యంగా వదిలేద్దామనుకున్నాడు.

¶ అందుకు వారు, “అలాటప్పుడు ఒక స్త్రీని విడిచిపెట్టాలంటే ఆమెకు విడాకుల పత్రిక రాసివ్వాలని మోషే ఎందుకు ఆజ్ఞాపించాడు?” అని అడిగారు.

¶ ‹“భార్యకు విడాకులు ఇచ్చి మరో స్త్రీని పెళ్ళి చేసుకొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడు. అలాగే విడాకులు తీసుకున్న స్త్రీని పెళ్ళి చేసుకొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడు.›