ఆయన దూర ప్రజలకు సంకేతంగా జెండా ఎత్తుతాడు. భూమి కొనల నుండి వారిని రప్పించడానికి ఈల వేస్తాడు. అదిగో, వారు ఆలస్యం లేకుండా వేగంగా వస్తున్నారు.
TSK
TSK · ద్వితీ 28:49
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
ఇశ్రాయేలు ప్రజలారా, వినండి, దూరం నుండి మీ మీదికి ఒక జనాన్ని రప్పిస్తాను. అది చాలా పురాతనమైన జనం. దాని భాష నీకు రాదు. ఆ జనం పలికే మాటలు నీకు అర్థం కావు.
¶ యెహోవా ఇలా చెప్తున్నాడు. “తన రెక్కలను విప్పార్చుకుని ఎగిరే గద్దలా శత్రువు మోయాబు పైకి వస్తున్నాడు.
¶ మమ్మల్ని తరిమే వాళ్ళు ఆకాశంలో ఎగిరే గద్దలకన్నా వేగం గల వాళ్ళు. పర్వతాల్లోకి వాళ్ళు మమ్మల్ని తరిమారు. అరణ్యంలో మా కోసం కాచుకుని ఉన్నారు.
¶ ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. ఒక పెద్ద డేగ ఉంది. దానికి పెద్ద రెక్కలున్నాయి. వాటి నిండుగా ఈకలున్నాయి. దానికి అనేక రంగులతో దట్టమైన రెక్కలు ఉన్నాయి. ఈ రంగుల పక్షి లెబానోనుకి వెళ్ళి అక్కడ ఒక దేవదారు చెట్టుపై వాలింది.
నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడ్డాను. కాబట్టి ఆయన తన దూతను పంపాడు. సింహాలు నాకు ఎలాంటి హానీ చేయకుండ వాటి నోళ్లు మూతపడేలా చేశాడు. రాజా, నీ దృష్టిలో నేను ఎలాంటి నేరం చేయలేదు గదా” అని జవాబిచ్చాడు.
¶ ఈ 62 వారాలు జరిగిన తరువాత అభిషిక్తుడు పూర్తిగా నిర్మూలం అయి పోతాడు. వస్తున్న రాజు ప్రజలు పవిత్ర పట్టణాన్ని పరిశుద్ధ ఆలయాన్ని ధ్వంసం చేస్తారు. వాడి అంతం హఠాత్తుగా వస్తుంది. యుద్ధ కాలం సమాప్తమయ్యే వరకూ నాశనం జరుగుతుందని నిర్ణయం అయింది.
¶ కల్దీయులను నేను రేపుతున్నాను. వినండి. వారు తమవి కాని ఉనికిపట్టులను ఆక్రమించాలని భూదిగంతాలదాకా సంచరించే ఉద్రేకం గల క్రూరులు.
‹ప్రభువు నిన్ను సందర్శించిన కాలం నువ్వు తెలుసుకోలేదు. కాబట్టి నీ శత్రువులు నీ చుట్టూ మట్టిదిబ్బ కట్టి నిన్ను ముట్టడించి అన్ని వైపుల నుండి నిన్ను అణచివేస్తారు. నిన్నూ నీలో ఉన్న నీ పిల్లలనూ మంటిపాలు చేస్తారు.›